కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం 'నా సామిరంగా' ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఎలాగైనా సంక్రాంతి సీజన్ లో తన సినిమా ఉండాలని పట్టుబట్టి మరి 'నా సామిరంగా' షూటింగ్ ని పరుగులు పెట్టించాడు ఈ సీనియర్ హీరో. నాగ్ కి సంక్రాంతి సీజన్ బాగా కలిసి వచ్చింది. అందుకే ఈసారి 'నా సామిరంగా' అంటూ థియేటర్స్ లో సందడి చేయబోతున్నాడు. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా ఆరంగేట్రం చేస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

ఇక ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ఫ్యాన్స్ రేటు పలికింది. సినిమాకి దాదాపు రూ.32 కోట్ల నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు సినిమా థియేట్రికల్ రైట్స్ ని స్వయంగా నాగర్జున సొంతం చేసుకున్నారు. నాన్ రీఫండబుల్ డీల్ ప్రకారం సుమారు రూ.15 కోట్లకు 'నా సామిరంగా' థియేట్రికల్ రైట్స్ ని నాగార్జున సొంతం చేసుకున్నట్లు తెలిసింది. సినిమాపై ఆయన ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉండడంతో థియేట్రికల్ రైట్స్ ని దక్కించుకున్నారట. మరోవైపు 'నా సామిరంగా' కోసం నాగార్జున రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోగా మిగతా బ్యాలెన్స్ అమౌంట్ ని రిలీజ్ కు ముందే నిర్మాతకి చెల్లించనున్నట్లు సమాచారం.

అంతేకాకుండా ఈ సినిమాని ఆంధ్ర, తెలంగాణ ఏరియాల్లో విడుదల చేయాలని నాగార్జున దిల్ రాజుని సైతం సంప్రదించారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ ద్వారానే విడుదల కాబోతోంది. శ్రీ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాస్ ఈ సినిమాని సుమారు రూ.45 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. సినిమా రిలీజ్ కి ముందే నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా నిర్మాతకి పెట్టిన బడ్జెట్లో మూడింతల డబ్బు వెనక్కి వచ్చేసింది. అంటే రిలీజ్ కి ముందే నిర్మాత లాభాల బాట పట్టినట్లే అని చెప్పొచ్చు. రూరల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆశికా రంగనాథ్, మిర్నా, రుక్సర్ థిల్లాన్ హీరోయిన్స్ గా నటిస్తుండగా.. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: