బ్రహ్మానందం అంటేనే కామెడీకి గురువు లాంటోడు. ఆయన ముఖం చూస్తేనే నవ్వుకునేంతలా సక్సెస్ అయ్యారు ఆయన. ఆయన సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది.నన్ను చూసి పిచ్చెక్కింది అనుకున్న జనాలకు.. నా సినిమాలు చూసి పిచ్చెక్కేలా చేస్తాను అని అంటారు. నిజంగానే అది చేసి చూపించారు బ్రహ్మానందం. వేయికి పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మానందం ఇప్పుడు వయసు రీత్యా కొన్ని సినిమాల్లో మాత్రమే కనిపిస్తున్నారు. పెద్ద సినిమాల్లో కనిపించట్లేదు. రీసెంట్ గా యాంకర్ సుమ కొడుకు రోషన్ హీరోగా నటించిన బబుల్ గమ్ సినిమాలో కనిపించాడు.కాగా బ్రహ్మానందం తన ఆత్మకథని నేను మీ బ్రహ్మానందం అనే పేరుతో ఉన్న బుక్ ని చిరంజీవితో విడుదల చేయించారు. ఈ బుక్ ద్వారా బ్రహ్మనందంకు సంబంధించిన ఎన్నో విషయాలను ప్రపంచానికి తెలియజేశారు. ఇందులో ఆయన తొలి ప్రేమకు సంబంధించిన విషయాలను కూడా తెలిపారు బ్రహ్మానందం. ఆయనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావడంతో చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదవుకున్నారంట. ఆయన చదువుల కోసం అనసూయమ్మ అనే మహిళ సాయం చేసిందంట. ఎంతో కష్టపడి బ్రహ్మానందం లెక్చరర్ అయ్యారంట.

ఆ సమయంలోనే బ్రహ్మానందంకు పెళ్లి చేయాలని ఇంట్లో వారు భావించారు. అలా పెళ్లి చేస్తే వచ్చే కట్నం తమకు పనికొస్తుందని ఇంట్లో వారు భావించారంట. కానీ బ్రహ్మానందం చదవుకు సాయం చేసిన అనసూయమ్మ ఓ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమని చెప్పింది. ఆమె పేరు లక్ష్మీ. అయితే లక్ష్మీ కాపు కులానికి చెందిన అమ్మాయి. కానీ బ్రహ్మానందం మాత్రం విశ్వ బ్రాహ్మణ కులానికి చెందిన వారు. కాబట్టి ఇంట్లో వారు ఒప్పుకోలేదు. కానీ బ్రహ్మానందం మాత్రం చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను లేదంటే జీవితాంతం బ్రహ్మాచారిగానే ఉండిపోతాను అని తెలిపారంట.ఎందుకంటే తొలిచూపులోనే బ్రహ్మానందంకు లక్ష్మీ బాగా నచ్చేసింది. దాంతో ఇంట్లో వారు చేసేది లేక వారిద్దరికీ పెళ్లి చేశారు. ఆ తర్వాత బ్రహ్మానందం లెక్చరర్ గా జాబ్ చేస్తూనే ఇటు సినిమాల్లో కూడా ప్రయత్నాలు చేశారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు కామెడీ లెజెండ్ అనిపించుకునే స్థాయికి ఎదిగారు.ఈ రోజు బ్రహ్మానందం ఈ స్థాయిలో ఉన్నారంటే దాని వెనకాల లక్ష్మీ గారు ఉన్నారని మాత్రం కచ్చితంగా అంటారు బ్రహ్మానందం. ఆయన కామెడీతో కోట్లాది మంది ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నారు బ్రహ్మానందం.

మరింత సమాచారం తెలుసుకోండి: