మరీ ముఖ్యంగా ఓ రెండు వెబ్ సైట్లు పనిగట్టుకుని తన గురించి చెడుగా రాస్తున్నారంటూ మండిపడ్డారు. ఇంతకీ దిల్ రాజు చెప్పిన ఆ వెబ్ సైట్లు ఏంటో అందరికీ తెలిసే ఉంటుంది. కాగా దిల్ రాజు అసహనానికి అసలు కారణం ఇది కాదంట. దానికి కారణం మరో పెద్ద ప్రొడక్షన్ సంస్థ అని తెలుస్తోంది. అది ఏదో కాదు మైత్రీ మూవీస్. ఈ సంస్థ వచ్చినప్పటి నుంచి పెద్ద సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఇప్పుడు నైజాంలో డిస్ట్రిబ్యూషన్ హౌస్ ను కూడా ఓపెన్ చేసింది. సలార్ సినిమాను మొన్న వీరే రిలీజ్ చేశారు. అంతే కాకుండా పెద్ద సినిమాలు మొత్తం వారే రిలీజ్ చేస్తున్నారు.
దాంతో దిల్ రాజుకు పెద్ద సినిమాలు లేకుండా పోతున్నాయి. అంతే కాకుండా సింగిల్ స్క్రీన్ థియేటర్లను మొత్తం వారే లాగేసుకుంటున్నారంట. దాంతో దిల్ రాజుకు బిజినెస్ లేకుండా పోతోంది. అందుకే ఆయనలో అసహనం కనిపిస్తోందని అంటున్నారు. ఇన్ని రోజులు ఇది లోలోపల ఉండేది.కానీ ఇప్పుడు ఇది బహిర్గతం అయిపోయింది. కానీ ఇప్పటి వరకు మైత్రీ మూవీస్ పేరు మాత్రం దిల్ రాజు తీయట్లేదు. కేవలం తన అసహనాన్ని మాత్రమే బయట పెడుతున్నారు. ఇప్పుడు మైత్రీ మూవీస్ వారు పెద్ద సినిమాలను నిర్మిస్తున్నారు. పుష్ప సినిమాతో పాటు మరో నాలుగు సినిమాలు వారి ఖాతాలో ఉన్నాయి.