ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. మైకేల్ (వినయ్ రాయ్) చిన్న వయసు నుంచి సూపర్ హీరోగా అవ్వాలంటూ కలలు కంటూ ఉంటాడు.అందుకోసం తన తల్లిదండ్రులను కూడా చంపేస్తాడు.. మరొకవైపు హనుమంత్ (తేజ సజ్జా) అంజనాద్రి అనే ఊరులో చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ తన కాలాన్ని గడుపుతూ ఉంటాడు.. అంజనమ్మ (వరలక్ష్మి శరత్ కుమార్) హనుమంత్ అక్కగా నటిస్తూ ఉంటుంది. మీనాక్షి (అమృత అయ్యార్) అంటే చిన్న వయసు నుంచి హనుమంతుకు చాలా ఇష్టము.. అయితే ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా మనసు విప్పి చెప్పరు.
అంజనాద్రి గ్రామం దాదాపుగా కొన్నేళ్లపాటు గజపతి అనే వ్యక్తి అదుపులో ఉంటుంది... అక్కడ ఎదురు తిరిగిన వారందరినీ మల్ల యుద్ధంలో ప్రాణాలు తీస్తూ ఉంటారు.. అలాంటి గజపతిని మీనాక్షి సైతం ఎదిరిస్తుంది.. ఆ సమయంలో ఆమెను కాపాడేందుకు వెళ్లిన హనుమాన్ అనుకోకుండా నదిలో పడిపోతారు. అక్కడే హనుమంతునికి సంబంధించి రుదిర మణి దొరుకుతుంది . అలా హనుమంతుకు సూపర్ పవర్ వస్తాయి. ఆ తర్వాత హనుమంత్ ఏం చేశారు ఆ ఊరిని కాపాడుకున్నారా లేదా అనే విషయం పైన ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఈ సినిమాలోని కొంతమేరకు బోరు కొట్టిన ఆ తర్వాత ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నట్టు ప్రేక్షకులు తెలుపుతున్నారు. ఇందులో కామెడీ సీన్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నట్టు తెలుస్తోంది. హనుమంతుకు సూపర్ పవర్స్ వస్తాయి అప్పుడు ఆ సన్నివేశాలను పిల్లలు భలే ఎంజాయ్ చేస్తున్నట్లుగా ప్రేక్షకులు తెలుపుతున్నారు. సెకండాఫ్ ఎలివేషన్స్ ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయని తెలుపుతున్నారు. ఫ్రీ క్లైమాక్స్లో అద్భుతంగా ఉందని ఇందులో సిస్టర్ సెంటిమెంట్ కూడా ఆకట్టుకుందని తెలుస్తున్నాయి. నార్త్ ఆడియో సినిమా ఉందని తెలుస్తోంది.
.