పెట్టుబడి పెట్టిన వారంతా కూడా వీలైనంత త్వరగా రాబట్టుకోవాలని అనుకుంటారు. ఓవరాల్ గా ఇదొక వ్యాపారం.. ఇక్కడ ఎవరిని అణిచి వేయడం జరగదని అన్నారు. అంతేకాదు మంచి సినిమాను ఎవరు ఆపలేరని కూడా చెప్పుకొచ్చారు దిల్ రాజు.
బాగున్న సినిమాను ఎవరు ఆపలేరని చెప్పారు. అయితే గుంటూరు కారం సినిమాకు ఎక్కువ థియేటర్స్ ఇచ్చి హనుమాన్ కి తక్కువ థియేటర్స్ కేటాయించడంపై అంతకుముందే దిల్ రాజు పై నెటిజెన్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కానీ దిల్ రాజు మాత్రం సినిమా అనేది ఒక బిజినెస్ అని ఇక్కడ లెక్కలు ఇలానే ఉంటాయని చెప్పకనే చెప్పారు. సంక్రాంతికి పెద్ద సినిమాగా వచ్చిన గుంటూరు కారం సినిమాకు ఎక్కువ థియేటర్లు కేటాయించారని దిల్ రాజు మీద కొందరు బ్యాక్ ఫైర్ అవుతున్నారు. కానీ ఇండస్ట్రీని నిలబెట్టేది ఇలాంటి పెద్ద సినిమాలే అని కొందరు దిల్ రాజుకి సపోర్ట్ గా నిలుస్తున్నారు. గుంటూరు కారం అసలు రిజల్ట్ అనేది పండుగ తర్వాత నాలుగు రోజుల వసూళ్లను బట్టి తెలుస్తుందని అన్నారు దిల్ రాజు. ఫెస్టివల్ సీజన్ లో సినిమాలన్నీ టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు రాబడతాయి. గుంటూరు కారం మొదటి రోజే 95 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని చెబుతున్నారు.