తమిళ సీనియర్ స్టార్ హీరో శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటి 'వరలక్ష్మి'. తమిళ, తెలుగు భాషలతో పాటు సౌత్ లోని ఇతర సినిమాలలో కూడా మెయిన్ రోల్స్, విలన్ పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు.ఇక తెలుగులో అయితే వరలక్ష్మికి చాలా మంచి ఇమేజ్ ఉంది. పైగా ఈమె ఒక సినిమాలో చేస్తుందంటే.. అది సినిమాకి బలమయ్యే పాత్ర అని ఆడియన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యిపోతారు.తాజాగా వరలక్ష్మి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ‘హనుమాన్’ సినిమాలో హీరో అక్క పాత్రని పోషించారు. సినిమాలో ఈ పాత్ర చాలా పవర్ ఫుల్ గానే ఉంటుంది. తమ్ముడి కోసం పోరాడానికి  సిద్దపడే అక్క పాత్రలో వరలక్ష్మి జనాల నుంచి విజిల్స్ అందుకున్నారు. ఈ సంక్రాంతి పండుగ బరిలో రిలీజైన ఈ సినిమా దేశావ్యాప్తంగా యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. వరలక్ష్మి ట్రాక్ రికార్డ్ కనుక చూసుకుంటే ఆమె నటించిన సినిమా సంక్రాంతికి వస్తే అది కచ్చితంగా విజయం అందుకోవాల్సిందే.


గత సంవత్సరం బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా సంక్రాంతి పండగకి రిలీజయ్యి సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వరలక్ష్మి బాలకృష్ణ సోదరిగా బలమైన పాత్రలో నటించారు. అన్న పై ప్రేమని, పగని చూపిస్తూ రెండు షేడ్స్ తో ఆడియన్స్ ని ఎంతో థ్రిల్ చేశారు.పైగా ఆ సినిమాకి వరలక్ష్మి పాత్ర మెయిన్ హైలైట్ అయ్యింది. ఆ సినిమా కథ కూడా ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. మలినేని గోపీచంద్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు.ఇక ఇదే దర్శకుడు డైరెక్షన్ లో 2021 సంక్రాంతికి వచ్చిన సినిమా ‘క్రాక్’.మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ ని ఈ చిత్రం మళ్ళీ ట్రాక్ ఎక్కించింది. మాస్ మహారాజ్ అభిమానులకు మర్చిపోలేని కిక్ ని ఈ సినిమా అందించింది. ఈ సినిమాలో కూడా వరలక్ష్మి బలమైన పాత్రని పోషించారు. ఈ సినిమాలో హీరో పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో ఇక విలన్ రోల్స్ పోషించిన సముద్రఖని, వరలక్ష్మి పాత్రలు కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటాయి.ఈ విధంగా వరలక్ష్మి సంక్రాంతి సినిమాలకి హిట్ ఫార్ములాగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: