తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ల మధ్య డేటింగ్ రూమర్స్ లాంటివి చాలా తక్కువ. కానీ విజయ్ దేవరకొండ-రష్మిక గురించి మాత్రం ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి.కొన్నిరోజుల క్రితం అలానే వీళ్లిద్దరూ నిశ్చితార్థం చేసుకోనున్నారని టాక్ వినపడింది. ఫిబ్రవరిలో ఉంటుందని గోలగోల చేశారు. తీరాచూస్తే అలాంటిదేం లేదని తేలింది. అయితే ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి రహస్యంగా ఫారెన్ ట్రిప్‌కి వెళ్లొచ్చారనే పుకార్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆ ఫొటోల్ని చూపించి మరీ దీని గురించి మాట్లాడుకుంటున్నారు.కన్నడ బ్యూటీ రష్మిక.. విజయ్ దేవరకొండతో కలిసి తొలిసారి 'గీతగోవిందం' మూవీలో నటించింది. ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్' అని మరో సినిమా చేశారు. ఈ రెండు చిత్రాల ఫలితం ఏంటనేది పక్కనబెడితే వీళ్ల మధ్య కెమిస్ట్రీ.. అభిమానులకు తెగ నచ్చేసింది. అదే టైంలో వీరిద్దరి గురించి డేటింగ్ రూమర్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. గతంలో మాల్దీవుల్ ట్రిప్‌కి కలిసి వెళ్లారని కొన్ని ఫొటోలతో సహా వైరల్ చేశారు.తాజాగా కొన్ని రోజుల క్రితం విజయ్ దేవరకొండ కొన్ని ఫొటోలు పోస్ట్ చేశాడు. అది టూర్ అని తెలుస్తోంది కానీ ప్లేస్ ఎక్కడ అనేది అర్థం కాలేదు. ఇకపోతే తాజాగా రష్మిక కొన్ని ఫొటోల్ని పోస్ట్ చేసింది. ఇవన్నీ వియత్నాంలో దిగిన పిక్స్ అన్నట్లు పేర్కొంది. ఇప్పుడు వీళ్లిద్దరూ ఫొటోల్ని కాస్త అబ్జర్వ్ చేసిన కొందరు నెటిజన్స్.. విజయ్-రష్మిక కతెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం కామన్ పాయింట్ అయిపోయిన పనేదైనా ఉంది అంటే అది డేటింగ్ పేరుతో స్టార్ హీరో హీరోయిన్స్ ఏం చక్క చెట్టాపట్టాలెసుకొని తిరగడమే పనిగా పెట్టుకుంటున్నారు. కొద్దిగా సినిమా షూటింగ్ లో ఫ్రీగా ఉంటే చాలు వేకెషన్స్ కు బయల్దేరి వెళ్తున్నారు. అయితే ఈ మధ్య మన రౌడీ హీరో అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా అలాగే చేసారు అని చెప్పాలి.లిసి ఈ ట్రిప్‌కి వెళ్లారని, అది కూడా సీక్రెట్‌గా అని మాట్లాడుకుంటున్నారు. ఇందులో నిజమేంటనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: