మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమా 'అంజి'.ఈ సినిమా భారీ అంచనాల నడుమ జనవరి 15, 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నమ్రత శిరోద్కర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నాగబాబు మరియు టినూ ఆనంద్ కీలక పాత్రలు పోషించారు. అప్పట్లోనే అద్భుతమైన గ్రాఫిక్స్ తో ఈ సినిమాను రూపొందించారు. ఈ మూవీ షూటింగ్ ఏకంగా 5 సంవత్సరాల పాటు కొనసాగింది. అంతేకాదు, ఇంటర్వెల్ సీన్ కోసం ఏకంగా నెల రోజుల పాటు షూటింగ్ జరిపినట్లు అప్పట్లో దర్శకుడు కోడి రామకృష్ణ చెప్పిన వీడియో ఒకటి తాజాగా వైరల్ అవుతుంది.‘అంజి’ సినిమాను నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి అప్పట్లోనే భారీ బడ్జెట్ తో నిర్మించారు.అంజి సినిమాకు ఖర్చు విషయంలో ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ సినిమా కోసం చిరంజీవి ఎంతో కష్టపడ్డారని దర్శకుడు కోడి రామకృష్ణ తెలిపారు.. ఈ చిత్రం కోసం చిరంజీవి ఎన్ని రోజులైనా కష్టపడి పని చేస్తానని చెప్పారు. కొత్త ఆర్టిస్టు మాదిరిగానే ఆయన కష్టపడ్డారని కోడి రామకృష్ణ తెలిపారు.. సినిమా మొత్తం ఆయన ఎంతో ఓపికగా నటించారు. ఈ సినిమా కోసం చిరంజీవి ఒక షర్ట్ ను రెండు సంవత్సరాల పాటు వేసుకున్నారు. గ్రాఫిక్స్ కోసం చిరంజీవి డ్రెస్కు మార్కులు పెట్టేవాళ్లం. ఆయన రోజూ అదే డ్రెస్ వేసుకునే వారు. కనీసం ఉతకడానికి కూడా ఉండేది కాదు. అలా రెండేళ్లు అదే షర్ట్ ను వేసుకున్నారు. సినిమా పట్ల ఆయనకు అంత డెడికేషన్ ఉండేది” అని ఆయన వెల్లడించారు.ఇక ‘అంజి’ సినిమా ఇంటర్వెల్ సీన్ నెల రోజుల పాటు షూట్ చేసినట్లు చెప్పారు.. చిరంజీవి కూడా ఆ సీన్ ఎంతో ఓపిగ్గా చేశారు. కేవలం గ్రాఫిక్స్ మాత్రమే కాదు. స్టోరీ విషయంలో చాలా క్రిటికల్ గా ఉంటుంది. ఈ సినిమాలో నాగ బాబును పెద్దయ్య అనే క్యారెక్టర్ చేయించాం. ఈ సినిమా షూటింగ్ కోసం ఎంత కష్ట పడ్డామో, ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ కోసం అంతకంటే ఎక్కువ కష్టపడ్డాం. ఈ సినిమాలో ఒక్కో సీన్ కోసం వందకు పైగా షాట్స్ తీసేవాళ్లం. అంతలా షూట్ చేయాల్సి వచ్చింది కాబట్టే 5 సంవత్సరాలు షూట్ చేశాం. ఈ సినిమా సంబంధించిన గ్రాఫిక్స్ పనులు సింగపూర్, మలేషియా మరియు అమెరికాలో చేయించాం” అని ఆయన వెల్లడించారు. ‘అంజి’ సినిమా అనేది తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ల్యాండ్ మార్క్ చిత్రంగా చెప్పుకొవచ్చు. ఈ సినిమా కోసం అందరం ఎంతో కష్టపడి పని చేశాం. దర్శకుడిగా నాకు ఎంతో తృప్తినిచ్చిన చిత్రం. అనుకున్న స్థాయిలో ఈ సినిమా ఆడకపోయినా కూడా మేము ఈ సినిమా కోసం పడిన తపన ఎలాంటిది అనేది ఇండస్ట్రీలో వాళ్లు అందరికీ తెలుసు’’అని కోడి రామకృష్ణ ఆ వీడియో లో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: