హృతిక్ రోషన్ ఫైటర్ ట్రైలర్ అదిరిపోయింది.భూమార్గంలో పోరాటాలు, పర్వత శ్రేణుల్లో గొరిల్లా పోరాటాలు.. సముద్ర మార్గంలో యుద్ధాలు.. వీటన్నిటి కంటే భిన్నమైన వైమానిక దళ దాడుల నేపథ్యంలో ఈ సినిమా హాలీవుడ్ లెవెల్ లో ఆద్యంతం ఉత్కంఠ కలిగించనుందని తాజా ట్రైలర్ చెబుతోంది.ఇక ఫైటర్ మేకర్స్ గ్రాండ్ ట్రైలర్‌ను సంక్రాంతి కానుకగా, సోమవారం నాడు విడుదల చేశారు. అనిల్ కపూర్, హృతిక్ రోషన్ , దీపికా పదుకొణె ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా భారతదేశపు మొట్టమొదటి 'ఏరియల్ యాక్షన్ థ్రిల్లర్'గా ప్రచారంలో ఉంది. ఈ ట్రైలర్ బ్యాక్ గ్రౌండ్ డైలాగ్‌తో ప్రారంభమవుతుంది. ఈ సినిమా భారతదేశం vs పాకిస్తాన్ నేపథ్యంలో సాగే కథాంశమని ట్రైలర్ తో స్పష్ఠత వస్తుంది. ఇక యుద్ధంలో ఫైటర్ జెట్‌లు ఒకదానికొకటి వెంబడించే విజువల్స్ ఆద్యంతం ఎంతగానో రక్తి కట్టించాయి. హృతిక్- దీపిక  ఏవియేటర్లుగా ఈ మూవీలో నటించారు.2019లో జరిగిన పుల్వామా అటాక్ నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు.


గతంలో లక్ష్య అనే చిత్రంలో హృతిక్ రోషన్ ఇండియన్ ఆర్మీ కెప్టెన్‌గా మెప్పించారు. ఇప్పుడు దాదాపు 20 ఏళ్ల తర్వాత ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ పైలెట్‌గా ప్రేక్షకులు ముందుకొస్తున్నారు.ఇక ట్రైలర్ చూస్తే హృతిక్ రోషన్ పెర్ఫామెన్స్, డైలాగులు అభిమానుల్లో దేశభక్తిని రగిలించేలా ఉన్నాయి. ఫుల్ యాక్షన్‌ అండ్‌ ఎమోషన్‌తో హృతిక్‌ రోషన్ నటన ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్‌లో  లుక్స్ సూపర్‌గా ఉన్నాయి. ఫైటర్ జెట్ పైలెట్‌గా హృతిక్ చేస్తున్న యాక్షన్ సన్నివేశాలు సరికొత్తగా ఉండటమే కాకుండా హాలీవుడ్ రేంజ్ మూవీ చూస్తున్న అనుభూతిని కలిగించడం ఖాయమట. ఇండియా 75వ రిపబ్లిక్ డే సందర్భంగా ఒక రోజు ముందే జనవరి 25న ఫైటర్ సినిమా రిలీజ్ అవుతోంది. హృతిక్ రోషన్ నుంచి వస్తున్న తొలి 3డీ సినిమా కూడా ఇదే. ఫైటర్ మూవీని 3డీ ఐమాక్స్ ఫార్మాట్‌లో రూపొందించడం జరిగింది. ఖచ్చితంగా ఈ సినిమా కూడా పెద్ద పాన్ ఇండియా హిట్టుగా నిలవడం ఖాయమట. మరి చూడాలి ఈ సినిమా కూడా బాలీవుడ్ కి 1000 కోట్లు తెచ్చిపెడుతుందో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి: