ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అప్పటికే చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారిని సైతం వెనక్కి నెట్టి ఏకంగా ప్రేక్షకులందరికీ కూడా మెగాస్టార్ గా మారిపోయాడు చిరంజీవి. దాదాపు గత నాలుగు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో స్టార్ హీరో గానే హవా నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే ప్రజారాజ్యం పార్టీని పెట్టి సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. దాదాపు ఒక పది సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు.


 కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం తనకు రాజకీయాలు సెట్ కావు అని అర్థం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి.. ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చాడు  ఇక రీ ఎంట్రీ లో కూడా ఖైదీ నెంబర్ 150 సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు చిరంజీవి. ఇక ఆ తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో టాప్ హీరో గానే ఉన్నాడు మెగాస్టార్. ఇక ఆయన తర్వాత టాప్ హీరో ఎవరు అనేదానిపై ఇప్పటికి క్లారిటీ లేదు. ఇక సీనియర్ హీరోలను మినహాయిస్తే ప్రస్తుతం పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, చరణ్,జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు ఎవరికి వారు సూపర్ హిట్లు కొడుతూ భారీ వసూళ్లు కూడా రాబడుతున్నారు.


 కానీ ఒకప్పుడు ఇండస్ట్రీకి బాస్ అనే చిరంజీవి పేరు తెచ్చుకున్నట్లుగా ఇక ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి బాస్ ఎవరు అనేది మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. దీనిపై ఎంతగానో చర్చ జరిగిన ఇప్పటివరకు సమాధానం మాత్రం దొరకలేదు. కారణం ఒక హీరో ఒక సినిమాతో సక్సెస్ కొడితే మరొక సినిమాతో ఫెయిల్యూర్ అందుకుంటున్నాడు. అలాంటప్పుడు ఆ హీరోని టాప్ హీరోగా పరిగణలోకి తీసుకోలేమని అటు విశ్లేషకులు కూడా అనుకుంటున్నారు. అయితే గతంలో చిరంజీవి ఆరు సంవత్సరాలలో ఆరు ఇండస్ట్రీ హిట్లను కొట్టాడు. అందుకే మెగాస్టార్ గా యనలేని ఖ్యాతిని సంపాదించాడు. మరి ఇప్పుడు ఇండస్ట్రీ బాస్ ఎవరు అంటే మాత్రం ఎవరు చెప్పలేని పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: