మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మలైకొట్టాయ్ వాలిబన్. ఈ మూవీలో మోహన్ లాల్ పవర్ ఫుల్ రెజ్లర్ పాత్రలో కనిపించబోతున్నాడు.తాజాగా మలైకొట్టాయ్ వాలిబన్ మూవీ ట్రైలర్ గురువారం (జనవరి 18) న రిలీజైంది. లిజో జోస్ పెల్లిస్సెరీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మోహన్ లాల్ లుక్ లీక్ కాకుండా మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.గత నెలలో ఈ మూవీ టీజర్ రిలీజవడంతో ఇందులో ఓ పవర్ ఫుల్ రెజ్లర్ గా మోహన్ లాల్ కనిపించబోతున్నట్లు తెలిసింది.. ఇక తాజాగా మలైకొట్టాయ్ వాలిబన్ మూవీ ట్రైలర్ కూడా వచ్చేసింది. బ్రిటీష్ వారి నుంచి స్వాతంత్ర్యం కోసం ఓ ప్రాంతం చేస్తున్న పోరాటాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు.63 ఏళ్ల వయసులో కూడా మోహన్ లాల్ ఓ పవర్ ఫుల్ రెజ్లర్ పాత్రలో కనిపించడం విశేషం.ఈ మూవీ కోసం మోహన్ లాల్ మేకోవర్ కూడా అద్భుతమనే చెప్పాలి."విజయాన్ని మించిన ఆనందం మరొకటి లేదు. నేను ఆ ఆనందంలో మునిగిపోయాను. కానీ అందులోనే నమ్మకద్రోహం ఉందని తెలుసుకోలేకపోయాను. నిన్ను నువ్వు మైమరచిపోయినప్పుడు ద్రోహానికి గురి కావడం సహజమే. ఇప్పుడు మంగోడు బరిలో మోసం తప్ప క్రీడాస్ఫూర్తి లేదు. అక్కడంతా రక్తం, కన్నీళ్లే. ఆ కన్నీళ్ల నుంచే సముద్రం పుట్టుకొస్తుంది. ఆ సముద్రం లోతుల్లో నుంచే మండే సూర్యుడు ఉద్బవిస్తాడు" అనే పవర్ ఫుల్ డైలాగులతో ఈ ట్రైలర్ మొదలవుతుంది.ఆ తర్వాత సీన్ లోకి మోహన్ లాల్ ఎంట్రీ ఇస్తాడు.మోహన్ లాల్ ఇంటెన్స్ లుక్ మూవీపై అంచనాలు పెంచేస్తోంది. ఈ సినిమా గురువారమే (జనవరి 18) సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది. ఈ మూవీకి యూఏ సర్టిఫికెట్ లభించగా.. మూవీ రన్ టైమ్ 155 నిమిషాలు (2 గంటల 35 నిమిషాలు)గా ఉంది. ఈ సినిమా చూసేందుకు థియేటర్లోకి వచ్చే ఫ్యాన్స్ అసలు నిరాశ చెందరని మోహన్ లాల్ తెలిపారు. ఇలాంటి జానర్ లో ఇప్పటి వరకూ ఇండియన్ సినిమాలో ఎలాంటి మూవీ రాలేదు . మలైకొట్టాయ్ వాలిబన్ మూవీని భారీస్థాయిలో నిర్మించాం. థియేటర్లోకి ఓపెన్ మైండ్ తో వచ్చే ప్రేక్షకులు నిరాశ చెందరు" అని మోహన్ లాల్ అన్నాడు. జనవరి 25న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: