కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'డెవిల్' సినిమా రిలీజ్ కి ముందు ఎదుర్కొన్న వివాదంతో డైరెక్టర్ నవీన్ మేడారం పేరు వార్తల్లోకెక్కింది. సినిమా ఆరంభంలో డైరెక్టర్ గా నవీన్ మేడారం పేరు కనిపించింది. ఆ తర్వాత అతని పేరుని తీసేసి నిర్మాత అభిషేక్ నామ దర్శకుడిగా తన పేరు వేసుకున్నారు. దీంతో ఇది కాస్త వివాదంగా మారింది. షూటింగ్ టైంలో ఏం జరిగిందో తెలియదు కానీ సినిమా రిలీజ్ టైం లో నవీన్ మేడారం సోషల్ మీడియా వేదికగా ఓ బహిరంగ లేఖను విడుదల చేశాడు. సినిమా కోసం తాను 105 రోజులు పనిచేశానని, అది తన సినిమా అని అందులో పేర్కొన్నాడు.

ఇక డెవిల్ రిలీజ్ అయిన తర్వాత ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర ఎబో యావరేజ్ గా నిలిచింది. ఆ విషయం పక్కన పెడితే.. డెవిల్ విషయంలో పలు ఇబ్బందులను ఎదుర్కొన్న నవీన్ మేడారం ఈటీవీ విన్ ఓటీటీలో వచ్చిన 90's వెబ్ సిరీస్ ని నిర్మించాడు. ఈ వెబ్ సిరీస్ ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ అందుకుని బ్లాక్ బస్టర్ అయింది. ఈ సందర్భంగా 90's వెబ్ సిరీస్ టీం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ ప్రెస్ మీట్ లో నవీన్ మేడారం తన లేటెస్ట్ ప్రాజెక్టు గురించి అప్డేట్ ఇచ్చాడు." నిఖిల్ స్పై సినిమా నిర్మాతలతో కలిసి ఓ ప్రాజెక్టు చేస్తున్నానని,

ఈ ప్రాజెక్టు క్రీ.పూ 300 కాలం నాటి కథతో ఉంటుందని, ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయిందని, ఈ ప్రాజెక్ట్ చాలా పెద్దదిగా గ్రాండ్ స్కేల్లో తెరకెక్కిస్తున్నట్లు తెలిపాడు. ఒకవేళ ఈ ప్రాజెక్టు కనుక వర్కౌట్ అయితే ఇండియా వైడ్ గా రిసాండ్ వస్తుంది, అది నా కాన్ఫిడెన్స్" అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో నవీన్ మేడారం చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక నవీన్ మేడారం విషయానికొస్తే.. 'బాబు బాగా బిజీ' అనే సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కౌట్ కాలేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: