టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొంతకాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అందాలతో కుర్రకారును ఆకట్టుకుంటుంది. ఆమధ్య ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం సమంత బోల్డ్ ఫోటోషూట్ ఏ రేంజ్ లో హాట్ టాపిక్ అయిందో తెలిసిందే. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అవుట్ ఫిట్స్ లో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకునే సమంత తాజాగా ఓ డిఫరెంట్ అవుట్ ఫిట్ తో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత లేటెస్ట్ పిక్ నేటిజన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. 

ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ లో ఉన్న అవుట్ ఫిట్ ధరించిన సామ్ తనదైన స్టైల్ లో హాట్ ఫోజ్ ఇచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్, నెటిజన్స్ మరోసారి సమంత అందాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 'సమంత ఎలాంటి అవుట్ ఫిట్ వేసిన దానికే అందం వస్తుందందని, సామ్ లేటెస్ట్ పోజ్ లో మరింత హాట్ గా ఉందని' కామెంట్స్ చేస్తున్నారు. ఇక సమంత పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. కొన్నాళ్ల క్రితం సమంత మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడింది. అందుకోసం ప్రత్యేకంగా ట్రీట్మెంట్ తీసుకుంది. ఈమధ్య కాస్త కోలుకుంది. అప్పటివరకు ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసిన తర్వాత కొంత గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకున్న

 సమంత రీసెంట్ గా వెకేషన్ లో భాగంగా ప్రపంచంలో వివిధ ప్రదేశాలను సందర్శించింది. మరోవైపు వీలైనంత త్వరగా మళ్లీ సినిమాలకు రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సమంత ఇప్పటికే కొన్ని స్క్రిప్టులు వింటున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది సమంతకు సరైన సక్సెస్ దక్కలేదు. ఆమె నటించిన 'యశోద' పరవాలేదు అనిపించింది. కానీ 'శాకుంతలం', 'ఖుషి' వంటి సినిమాలు బాక్సాఫీస్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి. ఖుషి సినిమాతో తర్వాత సినిమాలకి బ్రేక్ తీసుకున్న సామ్ అంతకంటే ముందు చేసిన 'సిటాడెల్' వెబ్ సిరీస్ త్వరలోనే విడుదల కాబోతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: