అసలు విషయంలోకి వెళ్తే ప్రభాస్ ఫ్రెండ్లీగా ఉండే డైరెక్టర్లలో వివి వినాయకు కూడా ఒకరు.. వివి వినాయక్ ప్రభాస్ తో కలిసి ఒక భారీ బడ్జెట్ సినిమాని తెరకెక్కించే విధంగా ప్లాన్ చేశారు. ఆ సినిమా ఏదో కాదు అల్లుడు శీను ఇందులో హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన.. అల్లుడు శీను సినిమాలో హీరోయిన్గా సమంత నటించింది.. ఈ సినిమాని మొదట ప్రభాస్ తో తీయాలనుకున్నారట వివి వినాయక్..అలా ఈ సినిమా స్టోరీ మొత్తం ప్రభాస్ కి చెప్పాక స్టోరీ బాగుందని చెప్పారట.
అయితే ఈ సినిమాలో హీరోయిన్గా సమంతను తీసుకుందామని వివిధ ప్రభాస్ కి చెప్పగా వామ్మో సమంత అయితే నేను చచ్చిన చేయనని తెగేసి చెప్పారట.. దీంతో నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాలో నటించని వేరే హీరోతో ఈ సినిమా చెయ్యి అని ప్రభాసే స్వయంగా వివి వినాయక్ సలహా ఇచ్చారట. అలా అల్లుడు శీను సినిమా చేసే సమయంలో ప్రభాస్ గురించి ఈ వార్త తెగ వైరల్ గా మారింది.. దీంతో అభిమానుల సైతం ప్రభాస్ కి నిజంగానే సమంత అంటే ఇష్టం లేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో వీరిద్దరి కాంబినేషన్లో ఏదైనా సినిమా పడుతుందేమో చూడాలి మరి.