ఒకవేళ సినిమాను కొమురం భీముడో పాట తర్వాత ముగించి ఉంటే ఇక రామ్ చరణ్ పాత్రకు అంత ప్రాముఖ్యత వచ్చేది కాదు. సైడ్ పాత్రలా అనిపించేది అంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే ఒక్కొక్కరు ఒక్కో సీన్లో హైలైట్ అవుతూ వచ్చారంటూ రెండు పాత్రలను రాజమౌళి గొప్పగా తెలిపారు. కానీ విజయేంద్ర ప్రసాదు మాత్రం సినిమా విడుదల కంటే ముందుగానే రాంచరణ్ పాత్రకు హైప్ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతే కాదు రామ్ చరణ్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయని పర్సనల్గా ఆ క్యారెక్టర్ తనకు చాలా ఇష్టమని కూడా తెలిపాడు. అంతేకాదు ఎన్టీఆర్ ది సపోర్టింగ్ రోల్ అన్నట్టుగానే మాట్లాడాడు. దీంతో రాంచరణ్ అభిమానులు ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు.
ఒక పాత్రను తక్కువ చేయడం ఒక పాత్రను ఎక్కువ చేయడం అనేది మాకు ఉండదు.. అసలు అలా అనుకోను.. రాసేటప్పుడు కూడా రెండు పాత్రలు మాకు ఒకేలా అనిపించాయి.. ఒకేలా అనుకొనే రాశాము.. ఎన్టీఆర్ పాత్రలో అమాయకత్వం ఉంటుంది.. ఎన్టీఆర్ పోషించిన పాత్ర చేయడం అనేది చాలా కష్టం. సాధారణంగా కథనం ముందుకు తీసుకెళ్లడంలో సపోర్టింగ్ గా ఉంటుంది అంటూ విజయేంద్ర ప్రసాద్ చెప్పిన మాటలు ఇప్పుడు మళ్ళీ నెట్టింట్లో వైరల్ అవుతూ వివాదాలకు దారితీస్తున్నాయి.. ఇకపోతే రామ్ చరణ్ ను చివర్లో అల్లూరి సీతారామరాజు గా చూపిస్తే నార్త్ వాళ్ళు నిజంగానే రాముడు వచ్చారని అనుకున్నారు . మేము ఆ ఉద్దేశంతో సినిమా తీయలేదు కానీ నార్త్ వాళ్ళు అలా అనుకున్నారు అంటూ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికైతే విజయేంద్రప్రసాద్ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.