టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో  గేమ్ చెంజర్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు సినిమా మాత్రం ఇంకా పూర్తిగా అవడం లేదు. దీంతో ఈ విషయంపై కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు మెగా అభిమానులు. ఇక ఈ సినిమా ఆలస్యం కావడంతో రామ్ చరణ్ తన తదుపరి సినిమాని కూడా లైన్లో పెట్టుకున్నాడు రామ్ చరణ్. ఉప్పెన బుచ్చిబాబు

 దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ చేసే దిశగా ఉంది అన్న వార్తలు వినబడుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్స్ స్టార్ట్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అయితే రామ్ చరణ్ బర్త్ డే కు ఈ సినిమా నుంచి మెగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.. శంకర్ డైరెక్షన్‌లో 'గేమ్ ఛేంజర్' మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించి మేజర్ వర్క్ కంప్లీట్ అయ్యిందని మిగతా 

పార్ట్ వేసవి తర్వాత షూట్ చేస్తారని అంటున్నారు. ఈ గ్యాప్‌లోనే రామ్ చరణ్-బుచ్చిబాబు RC 16 సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు.. మార్చి రెండవ వారంలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి మార్చి 27న టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.. ఈ సినిమాలో రామ్ చరణ్ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు.. కోస్తా ఆంధ్రా యువకుడిగా కనిపించబోతున్నారని టాక్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: