తొలి రోజు కేవలం రూ.3.6 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇక తొలి రోజు నుంచే వచ్చిన నెగటివ్ టాక్ తో కలెక్షన్లు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. సంక్రాంతి హాలీడేస్ లోనూ ఈ మూవీ పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయింది. రెండో వీకెండ్ వచ్చేసరికి అసలు చాలా థియేటర్లలో నుంచి సైంధవ్ కనపించకుండా పోయింది. మొత్తంగా 11 రోజుల్లో కేవలం రూ.18 కోట్లు మాత్రమే వచ్చాయి.మామూలుగా ఫ్యామిలీ హీరోగా పేరుగాంచిన వెంకటేశ్ సినిమాలు సంక్రాంతికి మంచి వసూళ్లే రాబడతాయి. కానీ సైంధవ్ మాత్రం అందుకు పూర్తి భిన్నమైన ఫలితాన్ని ఇచ్చింది. ఈ మూవీ జానర్ ఫెస్టివల్ మూడ్ కు తగినట్లు లేకపోవడం, హనుమాన్, నా సామిరంగ సినిమాలకు మంచి టాక్ రావడం కూడా సైంధవ్ డిజాస్టర్ గా మిగిలిపోవడానికి కారణాలుగా చెప్పొచ్చు.యాక్షన్ జానర్ లో వచ్చిన సైంధవ్ బయర్లను నిండా ముంచింది. ఈ ఫలితం వెంకటేశ్ కు మింగుడుపడనిదే. హిట్, హిట్ 2లాంటి మంచి హిట్ సినిమాలు అందించిన శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన సైంధవ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ సినిమా మాత్రం ఆ స్థాయిలో లేదు. వెంకీ ఫ్యాన్స్ కు కూడా ఈ మూవీ పెద్దగా నచ్చలేదు.
సాదాసీదా లైఫ్‌ను లీడ్ చేసే హీరోకు పవర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్ ఉండటం అనే పాయింట్‌ను. ఫ్యాక్షన్, మాఫియా, గ్యాంగ్‌స్టర్స్ అన్ని జోనర్స్‌లో వాడేశారు టాలీవుడ్ డైరెక్టర్స్. ఆ పాయింట్‌ను తీసుకొని కొత్త క్యారెక్టరైజేషన్స్‌తో శైలేష్ కొలను ఈ కథ రాసుకున్నట్లుగా అనిపిస్తుంది. హీరోకు ఓ రేంజ్ ష్లాఫ్‌బ్యాక్..అతడికి సపోర్ట్‌గా నిలిచే పవర్‌ఫుల్ క్యారెక్టర్స్... ధీటైన విలన్స్...అన్ని ఉన్నా సినిమాలో ఏదో మిస్సయిన ఫీలింగ్ కలుగుతుంది.యాక్షన్, ఎమోషన్స్ మధ్య కొన్ని సార్లు కనెక్టివిటీ కనిపించదు.సైకో నుంచి వెంకటేష్ సైంధవ్‌గా సాదాసీదా ఫ్యామిలీ మ్యాన్‌గా ఎందుకు మారాడన్నది సరిగా చూపించలేదు. ఆర్య, రుహాణిశర్మ, ఆండ్రియాతో పాటు చాలా మంది ప్రతిభావంతులైన నటీనటులు ఉన్నా వారి టాలెంట్‌ను పూర్తిస్థాయిలో వాడుకోలేదనిపిస్తుంది.