సౌత్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉంది. గత ఏడాది వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, సలార్ వంటి సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది ఈ కోలీవుడ్ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇక తాజాగా శృతిహాసన్ కి మరో మూవీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చేయాల్సిన ప్రాజెక్టు ఇప్పుడు శృతిహాసన్ చేతికి వచ్చినట్లు సమాచారం. సమంత గతంలో ఫిలిప్ జాన్ దర్శకత్వంలో 'చెన్నై స్టోరీ' అనే సినిమాకి కమిట్ అయింది. ఈ మూవీలో సమంత లేడీ డిటెక్టివ్ రోల్ చేస్తుందని ఆ మధ్య నిర్మాతలు వెల్లడించారు. 

'అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్' అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక తాజాగా సమంత ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోగా ఆమె స్థానంలో శృతిహాసన్ ని మూవీ టీం ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో శృతిహాసన్ తో పాటూ వివేక్ కల్రా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందునున్న ఈ చిత్రంలో శృతిహాసన్ అను అనే ప్రైవేట్ డిటెక్టివ్ పాత్ర పోషిస్తుంది. త్వరలోనే ఈ సినిమాని మొదలుపెట్టనున్నారు. కాగా సమంత ఈ ప్రాజెక్టు నుండి ఎందుకు తప్పుకుందనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి హెల్త్ పై దృష్టి సారించిన

 తరుణంలో ఈ ప్రాజెక్టు నుంచి సామ్ తప్పుకుందనే టాక్ వినిపిస్తోంది. ఇక శృతిహాసన్ విషయానికొస్తే.. రీసెంట్ గా ప్రభాస్ సరసన ఈ ముద్దుగుమ్మ నటించిన 'సలార్' డిసెంబర్ 22న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి సక్సెస్ ని అందుకుంది. కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 600 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి గత ఏడాది అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ప్రస్తుతం అడవి శేష్ సరసన 'డకాయిట్' అనే సినిమాలో నటిస్తోంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: