గత పదేళ్లుగా తమిళ ఇండస్ట్రీలో కొనసాగిస్తున్న సాక్షి అగర్వాల్ రాజా రాణి సినిమా తర్వాత సరైన సక్సెస్ను అందుకోలేదు. తమిళంలో ఇమే నటించిన రెండు మూడు సినిమాలు విడుదల కావాల్సి ఉండగా రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ గురించి తెలియజేసింది. అలాగే డైరెక్టర్ అట్లీ గురించి పలు విషయాలను తెలియజేసింది సాక్షి అగర్వాల్.. 2013లో మోడలింగ్ రంగంలో దూసుకుపోతున్న తనకి రాజా రాణి సినిమాలో నటించే అవకాశం వచ్చిందని మొదటిలో తనని సెలెక్ట్ చేసిన ఒక ఏజెన్సీ సినిమాలో సెకండ్ ఫిమేల్ లేడని ఆర్య ప్రధాన పాత్ర అని చెప్పారట.
అది విన్న తర్వాత ఆ సినిమాలో నటించడానికి వెళ్ళానని సినిమా కోసం షాపింగ్ మాల్స్ లో కొన్ని సీన్స్ చేశారని అయితే కొంత షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్లీ తనని షూటింగ్ కి పిలవలేదట ఒక దశలో సినిమా షూటింగ్ పూర్తి అయ్యి సినిమా విడుదలై చూడడానికి వెళ్ళినప్పుడు షాక్ అయ్యారని అక్కడ తన శీన్లన్నీ కట్ చేశారని వాళ్ళు చెప్పింది ఒకటి చేసేది ఒకటే అని తర్వాత తెలిసిందని తెలిపింది సాక్షి. అలాంటి సమయంలోనే తనకు ప్రొడక్షన్ కంపెనీల గురించి పెద్దగా తెలియదని.. డైరెక్టర్ అట్లీ దగ్గరికి వెళ్లి తన పాత్ర గురించి చర్చించే లేదు.. కానీ అది తన తప్పే అని చెప్పాడని అలా తనను ఈ సినిమాలో తీసుకుంటాను అంటూ మోసం చేశారని తెలిపింది సాక్షి.