ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో అడుగుపెట్టిన ఈ మూవీ హిందీలో స్ట్రీమ్ అవుతుంది. అయితే, ప్రస్తుతం ఈ సినిమా రూ.199 రెంట్‍తో అందుబాటులోకి ఉంది. అంటే ఈ చిత్రం చూడాలంటే ప్రైమ్ వీడియో సబ్‍స్క్రిప్షన్ ఉన్న వారు కూడా ఆ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కొంతకాలం తర్వాత సబ్‍స్క్రైబర్లందరూ ఉచితంగా చూసేందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ చిత్రంలో వలస కార్మికుడిగా మనోజ్ బాజ్‍పేయీ అద్భుతంగా నటించారు. హత్య చేయాలనుకునే వారి నుంచి తన పసిబిడ్డను రక్షించుకునేందుకు పలు సవాళ్లను ఎదుర్కోవడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది.జోరమ్ మూవీలో మహమ్మద్ జీషమ్ అయుబ్, స్మిత తాంబే, మేఘా మాథుర్, తనిష్ట చటర్జీ, రాజ్‍శ్రీ దేశ్‍పాండే మరియు అపూర్వ డోంగర్వల్ కీలకపాత్రలు పోషించారు. దేవాశీశ్ మకీజా దర్శకత్వం వహించిన ఈ మూవీకి మగేశ్ దక్డే సంగీతం అందించారు. జీ స్టూడియోస్ మరియు మఖీజా ఫిల్మ్స్ పతాకంపై షరీక్ పటేల్, అషిమా అవస్థి చౌదరీ, అనుపమ బోస్ మరియు దేవాన్శిశ్ మఖీజా నిర్మించారు.జోరమ్ మూవీ 2023లో రెటెర్‌డామ్ (నెదర్లాండ్స్)లో ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ ఫెస్టివల్‍లో ప్రదర్శితమైంది. 70వ సిడ్నీ ఫిల్మ్స్ ఫెస్టివల్, డర్బన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, 28వ బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ ఫెస్టివల్ మరియు 59వ చికాగో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‍లో ప్రదర్శితమైంది. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి స్టాండిగ్ ఓవియేషన్ దక్కింది. ఆస్కార్ లైబ్రరీలోనూ పర్మినెంట్ కోర్ కలెక్షన్లలో ఈ చిత్రం చోటు దక్కించుకుంది.అలాగే ఇటీవల ప్రకటించిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లోనూ జోరమ్ మూవీకి మంచి గుర్తింపు దక్కింది. క్రిటిక్స్ ఉత్తమ సినిమా మరియు ఉత్తమ కథ విభాగాల్లో ఈ చిత్రానికి అవార్డులు దక్కాయి.