‘హనుమాన్’ సినిమా కోసం రెండున్నరేళ్లు కష్టపడ్డ తేజ సజ్జా ఆ సమయంలో ఏకంగా 70 నుంచి 75 సినిమాలను వదులుకున్నట్లు తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.అయితే దీన్ని గమనించిన కొంతమంది నెటిజన్స్ మాత్రం దీన్ని నమ్మడంలేదు. మరీ అన్ని సినిమాల ఆఫర్స్ అనేవి తేజ కు వచ్చాయా అని నెటిజన్స్ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.“హనుమాన్ కోసం నేను సుమారు 25 లుక్ టెస్టులు ఇచ్చాను. సాధారణంగా ఓ సినిమా కోసం ఏ నటుడైనా కూడా రెండు, మూడు టెస్టులు మాత్రమే ఇస్తారు. ఈ మూవీలో స్టంట్స్ అన్నీ నేనే చేశాను. బాడీ డబుల్ లేదా వీఎఫ్ఎక్స్ ను ఉపయోగించలేదు. స్కూబా డైవింగ్ నేర్చుకొని మరీ నీటి లోపల సీక్వెన్స్ షూట్ చేశాను. అయితే హనుమాన్ మూవీ బాక్సాఫీస్ నంబర్లను నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. ఈ సినిమా ఆడియెన్స్ కు నచ్చిందా లేదా అనేదే చూశాను” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే హనుమాన్ ఓవర్సీస్ లో భారీ సక్సెస్ అందుకోవడంతో ప్రస్తుతం తేజ సజ్జాతోపాటు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరియు హీరోయిన్ అమృతా అయ్యర్ అమెరికాలో ఈ మూవీ ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు.