అయితే ఇలా తన సినిమాపై విమర్శలు చేస్తున్న వారికి గట్టిగా కౌంటర్ ఇస్తూనే వస్తున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి. ఇక ఇప్పుడు రచయిత జావేద్ అక్తర్ సైతం యానిమల్ మూవీ పై ఇలాంటి విమర్శలు చేశాడు. ఇలాంటి సినిమాలు సమాజానికి ప్రమాదకరం అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇక జావేద్ అక్తర్ కామెంట్స్ పై స్పందించిన డైరెక్టర్ సందీప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన సినిమాపై వేలు చూపించే ముందు జావేద్ కొడుకు ఫర్హాన్ అక్తర్ చేసే కంటెంట్‌ను పర్యవేక్షించాలి అంటూ కోరాడు. ఆయన సినిమా చూడలేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ కామెంట్ లో తను సినిమా మొత్తం చూడలేదని చాలా క్లియర్ గా కూడా ఉంది. ఇప్పుడు ఎవరైనా సినిమా చూడకుండా మాట్లాడితే వారి గురించి ఏం చెప్పాలి.. ఆయన సినిమా చూడలేదు ఆయన మాత్రమే కాదు.. ఈ కళాఖండంపై రాళ్లు విసురుతున్న ఎవరైనా వారు ముందుగా పరిసరాలను ఎందుకు తనిఖీ చేసుకోరు అంటూ ప్రశ్నించాడు. మీర్జాపూర్ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నప్పుడు తన కుమారుడు ఫర్హాన్ అక్తర్ కు ఇదే మాట ఎందుకు చెప్పలేదు అంటూ సందీప్ ప్రశ్నించాడు. ప్రపంచంలో ఉన్న బూతులన్నీ మీర్జాపూర్ లోనే ఉన్నాయి ఆ వెబ్ సిరీస్ దెబ్బకు నేను మొత్తం షో కూడా చూడలేదు అంటూ సందీప్ కౌంటర్ ఇచ్చాడు.