దివంగత నేత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన కొడుకు వైయస్ జగన్మోహన్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం యాత్ర.. 2019లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది. మళ్ళీ ఐదేళ్లకు సీక్వెల్ గా యాత్ర-2 చిత్రం రిలీజ్ అయింది.. డైరెక్టర్ మహీవి రాఘవ తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ గా వచ్చిన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ తో ముందుకు వెళ్తున్న ఈ నేపథ్యంలోని యాత్ర-2 చిత్రాన్ని చూసిన పలువురు సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కూడా సోషల్ మీడియా ద్వారా ఈ సినిమా గురించి పలు విషయాలను పంచుకుంటున్నారు.

ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ లో ఒకరైన యాంకర్ స్రవంతి కూడా సీఎం జగన్ బయోపిక్ ను థియేటర్లో చూసి అనంతరం ఇంస్టాగ్రామ్ లో ఈ సినిమా గురించి తమ అభిప్రాయాన్ని తెలియజేసింది.. యాత్ర-2 సినిమాల కీలకమైన సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.. అంతేకాకుండా అందుకు క్యాప్షన్ ఇస్తూ ఇంత మొండోడివి ఏంటి వైయస్ జగనన్న.. మీరు కూడా యాత్ర-2 చిత్రాన్ని చూసి జగనన్న మొండితనాన్ని ఆయన ధైర్యాన్ని గెలుపుని సైతం తెలియజేయండి అంటూ ఈమె రాసుకొచ్చింది.

ప్రస్తుతం యాంకర్ స్రవంతి షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ వీడియో చూసిన జగన్ అభిమానులు మాత్రం నువ్వు సూపర్ అక్క అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వైసిపి ఫ్యాన్స్ మాత్రం స్రవంతి పైన పాజిటివ్ గానే కామెంట్స్ చేస్తున్నారు మరి కొంతమంది మాత్రం కావాలని నెగటివ్ తో విరుచుకుపడుతున్నారు. పుష్ప సినిమా ఇంటర్వ్యూ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న స్రవంతి ఆ తర్వాత బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్లో కూడా పాల్గొని భారీ క్రేజ్ అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: