కన్నడ భామ రష్మిక మందన్న ఇప్పుడు బాలీవుడ్ లో కూడా దూసుకెళ్తుంది. యానిమల్ హిట్ తర్వాత రష్మిక రేంజ్ మారిపోయింది. ఆల్రెడీ పుష్ప 1 తో నేషనల్ లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న అమ్మడు ఇప్పుడు యానిమల్ తర్వాత మరింత పాపులర్ అయ్యింది. నేషనల్ క్రష్ వెంట అందరు మేకర్స్ వెంట పడుతున్నారు. అయితే ఈ క్రేజ్ వల్ల ఆమె ప్రస్తుతం చేస్తున్న ఫీమేల్ సెంట్రిక్ మూవీ రెయిన్ బోకి ఇబ్బందులు వచ్చేలా చేసింది. రెయిన్ బోర్ లేడీ ఓరియెంటెడ్ సినిమాగా రష్మిక లీడ్ రోల్ లో చేస్తుంది.

సినిమా ఒప్పుకున్న టైం లో రష్మికకు బాలీవుడ్ లో అంత క్రేజ్ లేదు. అయితే ఇప్పుడు నేషనల్ లెవెల్ లో ఆమెకున్న క్రేజ్ దృష్ట్యా కథలో కొన్ని మార్పులు చేయాలని చూస్తున్నారు. అంతేకాదు రష్మిక రెమ్యునరేషన్ విషయంలో కూడా భారీ డిమాండ్ చేస్తుందని అంటున్నారు. అంతకుముందు 2,3 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్న రష్మిక యానిమల్ హిట్ తర్వాత 4, 5 కోట్లు అంటుందట.

రష్మిక డిమాండ్ వల్ల ఆమెతో సినిమాలు చేయాలని అనుకుంటున్న మేకర్స్ వెనక్కి తగ్గుతున్నారు. పుష్ప 2 తో పాటుగా రష్మిక మరోపక్క ది గర్ల్ ఫ్రెండ్ సినిమా చేస్తుంది. ఈ సినిమాకు కూడా అమ్మడికి భారీ రెమ్యునరేషన్ అందిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా సరే ఆమె రేంజ్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని అలరిస్తుందని అంటున్నారు. మరి రష్మిక రెయిన్ బోర్ మళ్లీ మొదలవుతుందా లేదా అన్నది చూడాలి. రెయిన్ బో సినిమా ఇప్పటివరకు 40 శాతం మాత్రమే షూటింగ్ జరిగిందని టాక్. అయితే రష్మిక బల్క్ డేట్స్ ఇస్తేనే కానీ ఈ సినిమా పూర్తి చేయడం కష్టమని అంటున్నారు. తనకు వచ్చిన ఈ క్రేజ్ తో తెలుగులో ఆఫర్లు వస్తున్నా హిందీ సినిమాల మీదే తన ఫోకస్ పెడుతుంది రష్మిక.


మరింత సమాచారం తెలుసుకోండి: