ఇప్పటికే సినిమా షూటింగ్ నుంచి అల్లు అర్జున్ శారీ లుక్ లీక్ చేశారు. సినిమాలో గంగమ్మ తల్లి జాతకి సంబందించిన సీన్ ఉంటుంది. అందులో అల్లు అర్జున్ శారీ లుక్ తో కనిపిస్తారు. ఆమధ్య ఈ లుక్ తో వచ్చిన అఫీషియల్ పోస్టర్ కూడా వారెవా అనిపించింది. ఇక ఇప్పుడు సినిమా నుంచి లీక్స్ తో ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.
అల్లు అర్జున్ శారీ పిక్ వైరల్ కాగా లేటెస్ట్ గా సినిమాలో రావు రమేష్ కి సంబందించిన ఒక పొస్టర్ లీక్ అయ్యింది. సినిమాలో భూరెడ్డి సిద్ధప్ప నాయుడిగా రావు రమేష్ కనిపించనున్నారు. సినిమాలో ఒక పోస్టర్ లీక్ అయ్యింది. పుష్ప 1 లో ఆల్రెడీ ఈ రోల్ ఉన్నా పుష్ప 2 నుంచి ఈ పోస్టర్ లీక్ అవ్వడం పుష్ప ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. ఇక సినిమాను ఆగష్టు 15కి ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ సుకుమార్ మరోసారి పుష్ప 2 తో వారి మ్యాజిక్ ని రిపీట్ చేయాలని చూస్తున్నారు. అదే జరిగితే మాత్రం పుష్ప 2 మరో ట్రెండ్ సెట్టర్ మూవీ అవుతుందని చెప్పొచ్చు.