తమిళ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన నటలలో ఒకరు అయినటువంటి జయం రవి తాజాగా సైరన్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమనులు అయినటువంటి అనుపమ పరమేశ్వరన్ , కీర్తి సురేష్ లు హీరోయిన్ లుగా నటించగా ... అంథోని భాగ్యరాజ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమాని తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తెలుగు లో ఫిబ్రవరి 23 వ తేదీన విడుదల చేయబోతున్నారు. 

ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలబడింది. ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను తాజాగా ప్రకటించారు. ఈ సినిమా యొక్క తెలుగు థియేటర్ హక్కులను గంగా ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు దక్కించుకున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇకపోతే ఈ సంస్థ వారు ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కనుక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి విజయం సాధించినట్లు అయితే జయం రవి కి ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది.

ఇకపోతే ఈ మూవీ లో కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుంది. ఇది ఇలా ఉంటే కీర్తి సురేష్ , అనుపమ పరమేశ్వరన్ కు తెలుగు లో మంచి గుర్తింపు ఉండడంతో వీరి క్రేజ్ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ప్లేస్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మరి ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి. ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: