టాలీవుడ్ లో సూపర్ ఫాం కొనసాగిస్తుంది మృణాల ఠాకూర్. సీతారామ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ అమ్మడు ఒక రేంజ్ క్రేజ్ తెచ్చుకుంది. సీతారామం ఆ వెంటనే నాని హాయ్ నాన్న కూడా హిట్ అవటంతో మృణాలకి తెలుగులో తెలుగు లేకుండా అయిపోయింది. అందుకే దర్శక నిర్మాతలు అంతా ఆమె వెంట పడుతున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ లో నటిస్తుంది మృనాల్.

 విజయ్ దేవరకొండ హీరోగా పరుశురాం డైరెక్షన్లో వస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా ఆడియన్స్ లో సూపర్ బజ్ ఉంది. ఈ సినిమా హిట్టు పడితే అమ్మడు ఖాతాలో హ్యాట్రిక్ చేరినట్టే. ఇక తెలుగులో ఏ హీరోయిన్ అయినా సూపర్ ఫాం కొనసాగిస్తే ఆమెకు తమిళనాడు నుండి కూడా అవకాశాలు వస్తాయి. ఈ క్రమంలో మృనాల్ ఠాకూర్ కి కోలీవుడ్ నుండి కూడా ఛాన్సెస్ వస్తున్నాయి.  ఆల్రెడీ అమ్మడి కోసం అక్కడ దర్శక నిర్మాతలు సంప్రదించారని తెలుస్తుంది. తెలుగులో వరుసగా రెండు హిట్లు పడటంతో కోలీవుడ్లో అమ్మడు ఎంత డిమాండ్ చేస్తే అంత రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు దర్శక నిర్మాతలు రెడీ అంటున్నారు. ఏది ఏమైనా మృనాల్ ఠాకూర్ కి టాలీవుడ్ ఎంట్రీ  కెరీర్ గ్రాఫ్ పెరిగేలా చేసిందని చెప్పొచ్చు. ఇదే ఇదే ఫామ్ తమిళంలో కూడా కొనసాగిస్తే తెలుగు తమిళం లో మృణాలకి తిరుగు లేదని చెప్పొచ్చు.

సౌత్ లో టాప్ హీరో అయిన అయ్యేందుకు మృనాల్ చాలా కష్టపడుతుంది. సౌత్ లో ఇన్ని ఆఫర్లు వస్తున్న బాలీవుడ్ మీద అసంతృప్తిగా ఉంది అమ్మడు. తనమే అక్కడ కేవలం రొమాంటిక్ సినిమాల  వాడుకుంటున్నారని ఈమధ్య ఇంటర్వ్యూలో చెప్పింది. మరి సౌత్ లో ఆమెకి ఏర్పడుతున్న ఈ క్రేజ్ చూసైనా బాలీవుడ్ మేకర్స్ ఆమెకు లవ్ స్టోరీస్ లో ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: