
సమంత-నాగచైతన్య ఎందుకు విడిపోయారు అనేది ఒక సస్పెన్సు. 2021 అక్టోబర్ నెలలో ఈ జంట అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. ఈ క్రమంలో అనేక పుకార్లు, ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా సమంత టార్గెట్ చేయబడ్డారు.సమంత పెళ్లయ్యాక కూడా బోల్డ్ సన్నివేశాలు నటించడం ఇష్టం లేని నాగ చైతన్య విడాకులు ఇచ్చాడనేది ఒక వెర్షన్. అలాగే ఆమెకు పిల్లలు కనడం ఇష్టం లేదు. తన పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ తో ఎఫైర్ పెట్టుకుంది, అంటూ కథనాలు వెలువడ్డాయి.నిరాధార కథనాల మీద సమంత ఫైర్ అయ్యారు. ఆమె లీగల్ యాక్షన్ కూడా తీసుకున్నారు. కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్స్ పై కేసు పెట్టారు. కోర్టు ఆదేశాలతో సదరు ఛానల్స్ కంటెంట్ తొలగించడం జరిగింది. సమంత డిప్రెషన్ అనుభవించారు.
విడాకుల ఒత్తిడి నుండి బయటపడేందుకు సమంత మిత్రులతో గడిపారు. ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించారు. మెల్లగా ఆ బాధ నుండి కోలుకుని వర్క్ లో బిజీ అయ్యారు. విడాకుల అనంతరం సమంత యశోద, శాకుంతలం, ఖుషి చిత్రాల్లో నటించింది. సిటాడెల్ టైటిల్ వెబ్ సిరీస్ చేయగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.కాగా సమంత విడాకుల నిర్ణయం వెనుక ఒక అమ్మాయి ఉందనే సందేహాలు తాజాగా మొదలయ్యాయి. సమంత సోషల్ మీడియా పోస్ట్ దీనికి కారణం అయ్యింది. మలేషియాలో ఉండే మేఘన అనే ఫ్రెండ్ తో దిగిన ఫోటో సమంత షేర్ చేసింది. సదరు ఫోటోకి ఆసక్తికర కామెంట్ జోడించింది.నా విలువైన నిర్ణయాలకు ఒక ముఖం అంటూ ఉంటే... అది మేఘనే, అని సమంత కామెంట్ చేసింది. మేఘన తన జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అనేది తెలియజేసింది. కాబట్టి సమంత విడాకులు తీసుకోవడంలో మేఘన సలహాలు, సూచనలు ఖచ్చితంగా ఉండి ఉంటాయి. మేఘన అనుమతి తోనే సమంత విడాకులు తీసుకోవాలి డిసైడై ఉంటారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.