యంగ్ హీరో విశ్వక్ సేన్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. ఈయన ఏ విషయమైనా సరే ముక్కుసూటి తనంతో మాట్లాడుతూ ఎన్నో కాంట్రవర్సీలకు తెరలేపాడు.ఆయన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రోడ్డు మీద చేసిన ప్రమోషన్స్ వీడియో ఎంత పెద్ద వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అంతేకాదు టీవీ9 స్టూడియోలో జర్నలిస్టు దేవి నాగవల్లితో జరిగిన గొడవ కూడా పెద్ద వివాదం సృష్టించింది.వీటన్నింటికీ తోడు సీనియర్ నటుడు యాక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న అర్జున్ సర్జాతో గొడవ ఈయన పేరును మీడియాలో మరింత వైరల్ చేసింది. అయితే గతంలో అర్జున్ సర్జా తన కూతురర్ని హీరోయిన్ గా విశ్వక్సేన్ ని హీరోగా తానే నిర్మాతగా.. దర్శకుడిగా.. ఓ మూవీ తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా గ్రాండ్గా చేశారు. కానీ అంతా ఓకే అనుకునే సమయంలో విశ్వక్సేన్ కి అర్జున్ సర్జా కి మధ్య గొడవలు వచ్చి విశ్వక్ సేన్ ని అందులో నుండి తొలగించేశారు అర్జున్.. ఇక ఈ వివాదంపై అర్జున్ విశ్వక్ సేన్ ను నిందిస్తూ విశ్వక్ సేన్ కి పనిపై డెడికేషన్ లేదు.. అందుకే సినిమా నుండి తీసేసాం అని చెప్పారు.అయితే ఈ విషయం పై స్పందించిన విశ్వక్ సేన్ ఆయనకు క్షమాపణలు చెబుతూనే స్క్రిప్ట్ లో ఉన్న కొన్నింటిని మార్పులు చేయమన్నప్పుడు చేయకపోతే డైరెక్టర్ చెప్పిన దానికి కట్టుబడి ఉండి నేను వర్క్ చేయలేను..అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా ఈ గొడవపై మరోసారి విశ్వక్ సేన్ స్పందిస్తూ.. ఆరోజు నేను ఒక షూటింగ్ వాయిదా వేయమని చెప్పాను.కానీ సినిమాలో నటించనని ఎక్కడా చెప్పలేదు.ఆయన దానికే ప్రెస్ మీట్ లు పెట్టి నన్ను చాలా మాటలు అన్నారు. అదే నేను ఓ పెద్ద హీరోనై బ్యాగ్రౌండ్ ఉంటే అలా ఆయన నన్ను అనేవారా.. నాకు విలువ లేని చోట నా మనసు చంపుకుని పని చేయలేను. అలాగే నాకు ఇచ్చిన రెమ్యూనరేషన్ కూడా డబుల్ చేసి ఆయనకు ఇచ్చేశాను అంటూ విశ్వక్ సేన్ తాజాగా ఈ విషయం మరోసారి చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: