
రీసెంట్గా శ్రీరామ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో ఎవరినైనా హీరోయిన్ ని చూసి ఓరి దీని వేషాలో అని మీకు అనిపించిందా అని యాంకర్ అడగగా..నాకు హీరోయిన్ ఇలియానా ని చూస్తే అనిపించింది. ఎందుకంటే స్నేహితుడు సినిమా షూటింగ్ సమయంలో అందరం 7 లోపే వచ్చి షూటింగ్ సెట్ లో ఉంటే ఇలియానా మాత్రం 11,12 గంటలకి షూటింగ్ సెట్ కి వచ్చి మేకప్ లు,జుట్టు వేసుకునేది. అలా ఆమెని చూసినప్పుడు ఓరి దీని వేషాలో అనిపించింది.అలాగే నాకు ఇండస్ట్రీలో త్రిష మంచి స్నేహితురాలు..కానీ నేను వందనను పెళ్లి చేసుకునే సమయంలో వందన దగ్గరికి వెళ్లి అసలు వీడిని నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటున్నావు..వాడొక పెద్ద వేస్ట్ గాడు.. వాడికి ఇంగ్లీష్ రాదు.. చదువు రాదు.. వాడిని ఎలా చేసుకుంటావు అని వందనకు చెప్పింది.ఆ టైంలో ఇదేంటి నా బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండి నా పెళ్లే చెడగొట్టాలని చూస్తుంది అని అనుకున్నాను అంటూ త్రిష గురించి చెప్పుకొచ్చారు నటుడు శ్రీరామ్.