నిన్నమొన్నటి వరకు స్టార్ హీరోయిన్‌గా నెంబర్ వన్ ప్లేస్‌ను ఎంజాయ్ చేసిన పూజా హెగ్డే ఇప్పుడు టఫ్ సిచ్యుయేషన్‌ను ఫేస్ చేస్తున్నారు. వరుస ఫెయిల్యూర్స్ కారణంగా వచ్చిన అవకాశాలు కూడా పూజ కిట్టీ నుంచి జారీపోతున్నాయి. ఈ నేపథ్యంలో కెరీర్‌ను కంటిన్యూ చేసేందుకు బిగ్ డెసిషన్ తీసుకున్నారట ఈ బుట్టబొమ్మ.నిన్న మొన్నటి వరకు స్టార్ హీరోయిన్‌గా ఉన్న బుట్టబొమ్మ కెరీర్ సడన్‌గా రివర్స్ అయ్యింది. వరుస ఫెయిల్యూర్స్ అమ్మడి ఇమేజ్‌ను గట్టిగా డ్యామేజ్ చేశాయి. దీంతో చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ కూడా చేజారిపోతున్నాయి. భారీ ఆశలు పెట్టుకున్న రాధేశ్యామ్, పూజ ఇమేజ్‌ను దారుణంగా డ్యామేజ్ చేసింది.
పాన్ ఇండియా హీరోయిన్‌గా సెటిల్ అయిపోవచ్చని భావించిన అరవిందకు ఆ కల నెరవేరలేదు పైగా కెరీర్ పరంగా మరింత కష్టాల్లో పడింది ఈ ముద్దుగుమ్మ . సౌత్ సంగతి పక్కన పెడితే నార్త్ ప్రాజెక్ట్స్ కూడా పూజ కెరీర్‌ను గాడిలో పెట్టలేకపోయాయి.భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సల్మాన్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కి జాన్ కూడా బుట్టబొమ్మకు షాక్ ఇచ్చింది. ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫెయిల్ అయ్యింది. అందుకే ప్రజెంట్ షాహిద్‌కు జోడి నటిస్తున్న దేవ మీదే ఆశలు పెట్టుకున్నారు పూజ.ఈ నేపథ్యంలో పేమెంట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు పూజా హెగ్డే. ఇన్నాళ్లు 3 కోట్లకు పైగా పేమెంట్ అందుకున్న ఈ బ్యూటీ... ఇప్పుడు కోటిన్నరకు కాస్త అటు ఇటుగా డిమాండ్ చేస్తున్నారట. ఇలా అయినా అవకాశాలు వస్తాయని ఆశపడుతున్నారీ జిగేల్ రాణి. మరి పూజా కల నెరవేరుతుందేమో చూడాలి.