తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా పేరుపొందిన అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇప్పటి వరకు అల్లు అర్జున్ చేసిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలు అందుకున్నాయి. అయితే పుష్ప సినిమా తో పాన్ ఇండియా లెవెల్లో పేరు సంపాదించిన అల్లు అర్జున్ ఆ రేంజ్ లోనే సినిమాలను చేస్తున్నారు. ఆగస్టు 15న పుష్ప -2 చిత్రాన్ని రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా గత కొన్నేళ్లుగా అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ ఎక్కడ కనిపించలేదు.

సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నారు. ఇప్పటి వరకు సరైన సక్సెస్ ను కూడా అందుకోలేకపోతున్న అల్లు శిరీష్ కెరీర్ ని ఇప్పుడు గాడిలో పెట్టేందుకు అల్లు అర్జున్ స్వయంగా రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కొంత మంది స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట.. ఇదంతా ఇలా ఉంటే అల్లు శిరీష్ సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో చాలా మంది ట్రోలింగ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.


అయితే ఈసారి ఎలాగైనా తన తమ్ముడిని సక్సెస్ హీరోగా చూడాలని అల్లు అర్జున్ చాలా గట్టి సంకల్పంతో ముందుకు వెళుతున్నారు. అందుకే కొంత మంది తమిళ్ డైరెక్టర్ లతో అల్లు శిరీష్ సినిమాలు చేసే విధంగా పలు రకాల ప్రణాళికలతో అల్లు అర్జున్ ముందుకు వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారట మరి అల్లు అర్జున్ ఎంట్రీతోనైనా అల్లు శిరీష్ కెరియర్ మారుతుందేమో చూడాలి మరి. అల్లు అర్జున్ కెరియర్ల రెండు మూడు సినిమాలు తప్ప తన కెరియర్లో పెద్దగా చెప్పుకోదగినట్టుగా ఏమీ లేవు. కథల ఎంపిక విషయంలో అల్లు శిరీష్ సరైన నిర్ణయాలు తీసుకోలేదని అభిమానులు సైతం తెలియజేస్తున్నారు. ప్రస్తుతం టెడ్డీబేర్ అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మరి అన్నతోనైనా అల్లు శిరీష్ గట్టి ఎక్కుతారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: