ప్రశాంత్ నీల్.. ఈయన గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు  ఎందుకంటే ఈయన దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకు వచ్చిన సినిమాలే ఈయన పేరును దేశవ్యాప్తంగా మారుమోగిపోయేలా చేశాయ్. ఏకంగా విదేశాలకు కూడా ప్రశాంత్ నీల్ అనే పేరు పాకిపోయింది అన్న విషయం తెలిసిందే.  కే జి ఎఫ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషన్ సృష్టించాడు ప్రశాంత్ నీల్. ఇక ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించి అంతకు మించిన విజయాన్ని అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే.


 ఇక ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ అనే సినిమాను తీసి మరోసారి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. దీంతో ప్రశాంత్ నీల్. ఏదైనా సినిమా చేస్తున్నాడు అంటే చాలు ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టు కావడం ఖాయం అని సిరి ప్రేక్షకులు అందరూ కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడూ ఏకంగా ఎన్టీఆర్ తో సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నాడు ప్రశాంత్ నీల్. అయితే ఇక ఇలా డైరెక్టర్ గా ఎంతగానో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తులకు సైతం ఫేవరెట్ డైరెక్టర్లు ఎవరో ఒకరు ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇటీవల స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సైతం తన ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు అన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. అయితే ఎవరు ఊహించని పేరు చెప్పి ట్విస్ట్ ఇచ్చారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ స్టార్ డైరెక్టర్. ఈ క్రమంలోనే మీ అభిమాన దర్శకుడు ఎవరు అని అడగగా.. కన్నడ నటుడు ఉపేంద్ర తన అభిమాన దర్శకుడు అంటూ ఊహించని పేరు చెప్పాడు. ఉపేంద్ర లాగా ఎవరు సినిమాలు తీయలేరు. భిన్నమైన కథలను తెరపై ఆయన ఆవిష్కరించే తీరు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఆయన తీసిన సినిమాలు చూస్తే ఇలా కూడా తీసి హిట్టు కొట్టొచ్చా అని అనిపిస్తూ ఉంటుంది అంటూ ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: