వీరికి ఇద్దరు పిల్లలు కాగా పూరి జగన్నాథ్ మంచి చెడులలో ఆమె పాత్ర ఉంది. ఆమె గుణగణాలు ఎంత అద్భుతం అంటే ప్రభాస్ ఓసారి ఇంటర్వ్యూలో లావణ్య గురించి మాట్లాడాడు. లావణ్య అంటే తనకు చాలా ఇష్టమని ఆవిడ గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ చెప్పాడు. ఒకరోజు బుజ్జిగాడు సినిమా షూటింగ్ టైంలో లంచ్ పట్టుకుని షూటింగ్ కి వచ్చారట లావణ్య.
ఆవిడతో పాటు ఇంకొక లేడీ కూడా వచ్చారట. అందరూ కలిసి ఒకే చోట కూర్చొని భోజనం చేశారట. పూరి జగన్నాథ్, ప్రభాస్, లావణ్య ఇంకా కొంతమంది కలిసి భోజనం పూర్తి చేసుకున్నారట. లంచ్ పూర్తయిన తర్వాత ప్రభాస్ లావణ్యని అడిగారట. మీ పక్కన కూర్చున్న ఆడ వ్యక్తి ఎవరు అని ఆమె దానికి మా పని మనిషి అండి అని చెప్పారట.అంత పెద్ద షూటింగ్లో అంత మంది మధ్యలో ఒక పని మనిషి ని పక్కన కూర్చోబెట్టి తమతో సమానంగా భోజనం చేయనివ్వడం అనేది సాధారణంగా ఎవ్వరూ చేయరు. కానీ లావణ్య పని మనిషి కి కూడా ఒక అత్యున్నత స్థానం ఇస్తారు. అందుకే ఆవిడంటే తనకు చాలా ఇష్టం అని ప్రభాస్ చెప్పారు. తను ఇప్పటి వరకు అభిమానించే ఆడవాళ్ళలో ముందు స్థానంలో లావణ్య ఉంటారని కూడా చెప్పడం నిజంగా ఆమె గొప్పతనానికి నిదర్శనం.