మరోవైపు నాగబాబు వ్యాఖ్యలపై వరుణ్‌తేజ్ కూడా స్పందించారు. ఎత్తుకు సంబంధించి తన తండ్రి చేసిన వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించి కాదన్నారు. తన హైట్‌ను దృష్టిలో పెట్టుకొని చిన్న పోలిక చేశారని.. ఏ హీరోను కించపరిచే ఉద్దేశం లేదన్నారు. కాగా, శక్తిప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రమే 'ఆపరేషన్ వాలెంటైన్'.గత 2019లో జరిగిన పుల్వామా దాడి ఇతివృత్తంగా ఈ సినిమా రూపొందింది. భారత వైమానిక దళ వీరుల అలుపెరగని పోరాటాన్ని, దేశాన్ని రక్షించడంలో ఎదుర్కొంటున్న సవాళ్లను ఇందులో చూపించనున్నారు. మానుషి చిల్లర్ హీరోయిన్. మార్చి 1న తెలుగు, హిందీలో విడుదల కానుంది. రుహానీ శర్మ, నవదీప్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్ మంజూరు చేసింది.