టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన 'గామి' సినిమా నేడు విడుదల అయ్యింది. సినిమా ఎలా ఉందంటే.. ఇదో కొత్త ప్రయత్నం. నిజంగా ఈ ప్రయత్నానికి విశ్వక్ సేన్ ని మెచ్చుకోవాల్సిందే. ఈ సినిమా కథేంటి అని మాటల్లో చెప్పడం కూడా కష్టం. ఆ కథను విడమరిచి చెప్పకుండా.. పైగా అదే సమయంలో ఆసక్తి పోకుండా.. ఒక సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ.. ప్రేక్షకులను విజువల్ మాయాజాలంతో మెప్పిస్తూ సినిమాను ముందుకు నడిపించాడు డైరెక్టర్ విద్యాధర్. ఈ సినిమా చూస్తే ఓ కొత్త అనుభూతి అయితే కలుగుతుంది. అయితే కొన్ని ట్రాక్స్ మాత్రం అయోమయంగా బోరింగ్ గా అనిపిస్తాయి. కొన్ని ట్రాక్స్ మాత్రం విజువల్ గా  ప్రత్యేకంగా ఉంటాయి.అయితే ఇలాంటి సినిమాల్లో నరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది వర్క్ ఔట్ అయితే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడాన్ని ఎవరు ఆపలేరు. కానీ ఈ సినిమాలో నరేషన్ అనేది నెమ్మదిగా ఉండటం వల్ల ఈ ట్రాక్ బోర్ కొట్టిస్తుంది.అయితే ప్రేక్షకులను ప్రధానంగా ఎంగేజ్ చేసేది హిమాలయాల్లో విశ్వక్ చేసే సాహస యాత్రే. అందులో సాహసాలకు సంబంధించిన విజువల్స్ అనేవి కట్టిపడేస్తాయి. సవాళ్లను అధిగమించే క్రమంలో కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ అయినప్పటికీ.. ఓవరాల్ గా హిమాలయాల ఎపిసోడ్ అంతా కూడా చాలా ఎంగేజింగ్ గా అనిపిస్తుంది.


చివర్లో హీరో పాత్రకు సంబంధించిన రహస్యం తెలిసి ఖచ్చితంగా షాకవుతాం. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు మాత్రమే దీనికి బాగా ఇంప్రెస్ అవుతారు. ముగింపు సన్నివేశాలు చాలా బాగున్నాయి. ఓవరాల్ గా ఈ గామి సినిమా ఒక యునీక్ కాన్సెప్ట్ తో తెరకెక్కి.. ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని పంచుతుంది. కాకపోతే పూర్తి సీరియస్ గా సాగుతూ.. చాలా చోట్ల ప్యానిక్ మోడ్లో సాగే ఈ మూవీ అందరికీ రుచిస్తుందా అన్నదే డౌటే. రొటీన్ సినిమాలతో విసుగెత్తిపోయి కొత్తదనం కోసం చూసే ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి.ఇది నిజంగా టెక్నీషియన్స్ ఫిలిం. ప్రతి టెక్నీషియన్ కూడా తన ముద్రను చూపించడానికి చాలా కష్టపడ్డారు. మ్యూజిక్ డైరెక్టర్ నరేష్ కుమరన్ పాటలు కథలో చక్కగా కుదిరాయి. నేపథ్య సంగీతంతో సినిమాకు బలంగా నిలిచాడు నరేష్. సినిమా మొత్తం ఒక ఇంటెన్సిటీతో నడిచేలా చూడడంలో ఆర్ఆర్ పాత్ర కీలకంగా ఉంది. ఇక కెమెరామన్ విశ్వనాథ్ రెడ్డిని ఎంత మెచ్చుకున్నా సరిపోదు. ఆయన కష్టాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. సినిమాని చూస్తే ఒక విజువల్ వండర్ చూస్తున్న ఫీలింగ్ ఖచ్చితంగా కలిగిస్తాయి. ఓవరాల్ గా ఈ సినిమాకి 3/5 రేటింగ్ ఇవ్వొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: