బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈయన ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమా లలో హీరో గా నటించి ఇండియా వ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు . అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన కొంత కాలం క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొంది న గాడ్ ఫాదర్ అనే సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించాడు. ఈ చిన్న పాత్ర ద్వారానే ఈయన తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు .

ఇకపోతే తాజాగా సల్మన్ ఖాన్ తిండి మరియు వ్యాయామం గురించి అలాగే తనకు సంబంధించిన కొన్ని విషయాల గురించి ఆయన స్నేహితుడు అయినటు వంటి ధారా సింగ్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా సల్మాన్ స్నేహితుడు ధారా సింగ్ మాట్లాడుతూ ... సల్మాన్ తిండి మరియు వ్యాయామం విషయంలో అస్సలు రాజీపడడు . సల్మాన్ పందిలా తిని కుక్కల వ్యాయామం చేస్తాడు. తిన్నది అంతా ఎక్కడికి పోయింది అంటే అరిగిపోయింది అని చెబుతుంటాడు . అతడు ఆ అద్భుతమైన శక్తి. తన దగ్గర ఒక రూపాయి కూడా ఉంచుకోడు.

పేదలకు సహాయం చేస్తూ ఉంటాడు. తాను దాదాపుగా నెలకు 25 నుండి 30 లక్షల వరకు విరాళాలను ఇస్తూ ఉంటాడు అని సల్మాన్ గురించి అతని స్నేహితుడు దార సింగ్ తాజాగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే సల్మాన్ ఖాన్ తాజాగా "టైగర్ 3" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: