విశ్వక్ సేన్ ‘గామి’ ఊహించని ఘనవిజయం అందుకోవడంతో ప్రయోగాత్మక సినిమాలు కూడ ప్రేక్షకులకు నచ్చడమే కాకుండా వాటికి ఘనవిజయం ఎలా వస్తుందో ఇండస్ట్రీకి తెలిసి వచ్చేలా చేసింది. ‘మహాశివరాత్రి’ సెలవుతో పాటు వీకెండ్ కలిసిరావడంతో ఈమూవీ మొదటి మూడు రోజులు పూర్తి అయ్యేసరికి బ్రేక్ ఈవెన్ కు వచ్చి లాభాల బాట పట్టింది.



ఇప్పుడు ఈవిజయం విశ్వక్ సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ బిజినెస్ కు కలిసి వస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. వాస్తవానికి ఈసినిమా శివరాత్రి రోజున విడుదల కావలసి ఉంది అయితే ఈమూవీ బిజినెస్ అనుకున్న స్థాయిలో జరగక పోవడంతో ఆ డేట్ కు ‘గామి’ వచ్చి సక్సస్ సాధించి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సమస్యలు తీర్చింది అంటు కామెంట్స్ వస్తున్నాయి.



ఈమధ్యకాలంలో సరైన హిట్ లేక బాధ పడుతున్న ఈ యంగ్ హీరోకి ‘గామి’ సక్సస్ ధైర్యాన్ని కలిగిస్తుంది. విశ్వక్ సేన్ మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ‘లైలా’ మూవీలో ఈ యంగ్ హీరో లేడీ గెటప్ లో కనిపించబోతున్నాడు. ఈమూవీ కూడ సంచలన విజయం సాధిస్తుందని ఈహీరో నమ్మకం. గతంలో రాజేంద్రప్రసాద్ సీనియర్ నరేష్ లు లేడీ గెటప్ లో నటించి ఆసినిమాల ఘనవిజయానికి సహకరించిన విషయం తెలిసిందే.



సంచలన వార్తలకు కామెంట్స్ కు చిరునామగా కొనసాగే ఈయంగ్ హీరో ఈమధ్య బాలకృష్ణ నటించబోయే ఒక మూవీలో ప్రత్యేక పాత్రను చేయడానికి ఆశక్తి కనపరచలేదు అన్న వార్తలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తనకు హీరోగా ఎంతో పేరు తెచ్చిపెట్టిన ‘దాస్ కా ద్ధంకీ’ మూవీకి సీక్వెల్ తీయాలని ఈయంగ్ హీరో ప్రయత్నిస్తున్న వార్తలు కూడ వస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా ‘గామి’ సక్సస్ విశ్వక్ సేన్ ని మళ్ళీ నిలబెట్టింది. ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారిపోవడంతో డిఫరెంట్ కథలను ఎంచుకోవలసిన అవసరం ఉంది అన్న విషయాన్ని ‘గామి’ సక్సస్ మరొకసారి రుజువు చేసింది..  




మరింత సమాచారం తెలుసుకోండి: