అయితే హీరోయిన్ కళ్యాణిని ఇష్టపడి మరి ప్రేమించే సూర్య కిరణ్ వివాహం చేసుకున్నారు. అయితే మధ్యలో కొన్ని కారణాల చేత విభేదాలు రావడంతో వీరు విడాకులు తీసుకున్నారు.. ముఖ్యంగా తీసిన సినిమాలు ఫ్లాప్ అవడంతో అటు వైవాహి జీవితంలో కూడా పలు ఇబ్బందులు రావడంతో మానసికంగా కృంగిపోయి కొన్నేళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సూర్యకిరణ్ దాదాపుగా 7 సంవత్సరాలు ఎవరికి కనిపించకుండా ఉన్నారు.. 2020లో బిగ్ బాస్ సీజన్-4 లో కంటిస్టెంట్ గా అనూహ్యరీతిలో ఎంట్రీ ఇచ్చి గెలవడానికి పలు రకాల ప్రయత్నాలు చేశారు. కానీ ఫస్ట్ వీకే బయటికి వచ్చేసారు..
అలా బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక తన వ్యక్తిగత విషయాలను కూడా తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు సూర్యకిరణ్..కళ్యాణి తన అమ్మ తర్వాత అమ్మ అంటూ వెల్లడించారు. ఆమెని రోజు మిస్ అవుతూనే ఉన్నానంటు తెలిపారు. తన సోదరీమణుల పైన కూడా చాలా ప్రేమ ఉంది.. అంతే ప్రేమ కళ్యాణి పైనా కూడ ఉంటుంది అంటూ వెల్లడించారు సూర్యకిరణ్. కళ్యాణి లేని లోటు తన జీవితంలో ఎవరు భర్తీ చేయలేరని కూడా వెల్లడించారు. నేను తనకి అవసరం లేకపోవచ్చు నాకైతే ఆమెలేని లోటు చాలా కనిపిస్తోంది అంటూ ఎమోషనల్ అయ్యారు... మా ఇద్దరినీ విడాకులు వేరు చేసిన మమ్మల్ని మాత్రం దూరం చేయలేదని చెప్పుకొచ్చారు.. ఈ జన్మకే కాదు ఇంకెన్ని జన్మలెత్తినా కూడా కళ్యాణినే నా భార్య స్థానం అంటూ ఎమోషనల్ గా మాట్లాడారు. ఇప్పటికీ తన మొబైల్లో లాప్టాప్ లో కూడా ఆమె ఫోటోనే ఉన్నట్లు సమాచారం.