సాధారణంగా ఒక సినిమాని ఒక హీరోతో అనుకున్న తర్వాత మరొక హీరోతో చేసి సక్సెస్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి.. ముఖ్యంగా ఆ సమయానికి ఆ హీరో డేట్స్ ఖాళీగా లేకపోవడం లేకపోతే స్టోరీ నచ్చకపోవడం ఇలా కొన్ని సమస్యల వల్ల ఒక్కోసారి అనుకున్న వారితో కంటే మరొక నటుడుతోనే బెటర్ గా యాక్టింగ్ చేసే అవకాశం లభిస్తుంది. ఇలా సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది అవకాశాలు వచ్చి స్టార్ హీరోలుగా ఎదిగారు. సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నప్పుడు చాలామంది హీరోలు ఆ సినిమాని వదులుకున్నామని విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు.


అలా ఇప్పుడు నేచురల్ స్టార్ నాని మాత్రం అందరికీ చాలా విరుద్ధమని కూడా చెప్పవచ్చు. తన మనసులో ఎలాంటి విషయాన్ని కూడా దాచుకోకుండా కేవలం మీడియా ముందే తెలుపుతూ ఉంటారు. అలా తన ఎంతో ఇష్టపడి నటించాలనుకున్న ఒక సినిమాని డేట్స్ కుదరకపోవడంతో ఇతర హీరో చేశాడట. ఆ తర్వాత తీరా ఆ సినిమా విడుదల బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం చూసి ఆ సినిమా చూసిన ప్రతిసారి తనకు చాలా బాధ కలుగుతుందని నాని ఇటీవల వెల్లడించారు.


ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే రాజా రాణి ఈ చిత్రంలో మొదట ఆర్య పాత్రలో నాని నటించాల్సి ఉండగా కానీ ఆ సమయంలో మరొక సినిమాతో బిజీగా ఉండడం వల్ల ఈ చిత్రానికి డేట్లు అడ్జస్ట్ చేయలేకపోయారట దీంతో డైరెక్టర్ తమిళ హీరో ఆర్యతో ఈ సినిమాని పూర్తి చేశారు. అలా అతను లైఫ్ లో ఒక మంచి సినిమాని పోగొట్టుకున్నానని నాని ఇప్పటికీ చెబుతూ ఉండడం విశేషం. అయితే ఇది కేవలం నాని లైఫ్ లోనే కాదు చాలామంది హీరోల లైఫ్ లో కూడా జరిగిన సాధారణ సంఘటనలు అని కూడా చెప్పవచ్చు. ఇలాంటి సినిమా తన లైఫ్ లో వస్తే కచ్చితంగా మళ్ళీ వదులుకోనని కరాకండిగా చెప్పేశారు నాని.

మరింత సమాచారం తెలుసుకోండి: