టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి మాస్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి మ్యాచో స్టార్ గోపీచంద్ ఈ మధ్య కాలంలో వరుస అపజాలను అందుకుంటున్న విషయం మన అందరికీ తెలిసిందే. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన సిటిమార్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈయన ఆ తర్వాత పక్కా కమర్షియల్ ... రామబాణం అనే సినిమాలతో రెండు అపజయాలు అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు బీమా అనే సినిమాలో హీరో గా నటించాడు.  హర్ష అనే కన్నడ దర్శకుడు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మాళవిక శర్మ , ప్రియ భవాని శంకర్ హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమా ఈ సంవత్సరం మార్చి 8 వ తేదీన విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ మూవీ కి సంబంధించిన 12 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 12  రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి 12 రోజుల్లో నైజాం ఏరియాలో 2.87 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... సీడెడ్ ఏరియాలో 1.222 కోటి ... ఏపీ లో 3.30 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 12 రోజుల్లో 7.39 కోట్ల షేర్ ... 12.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని 71 లక్షల కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి 12 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 8.10 కోట్ల షేర్ ... 14.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.  ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 11.30 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇకపోతే ఈ మూవీ మరో 3.9 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

gc