సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమాలతో దూసుకుపోతున్నటువంటి అనుపమ పరమేశ్వరన్ త్వరలోనే టిల్లు స్క్వేర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.గత రెండు సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక త్వరలోనే ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇక ఇప్పటివరకు అనుపమ ఎన్నో సినిమాలలో నటించిన ఎప్పుడూ కూడా బోల్డ్ రొమాంటిక్ సీన్స్ మాత్రం చేయలేదు కానీ ఇటీవల ఈమె కాస్త బోల్డ్ సీన్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.ఇక టిల్లు స్క్వేర్ సినిమాలో నటుడు సిద్దు జొన్నలగడ్డ తో కలిసి ఈమె భారీ స్థాయిలో రొమాన్స్ చేశారు. ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి ట్రైలర్లో ఈమె కారులో సిద్దూతో కలిసి ఘాటు లిప్ లాక్ సీన్లలో నటించింది.

దీనిపై ఆమె మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రొమాంటిక్ సీన్స్ చేయడం అంత సులభం కాదని తెలిపారు. చుట్టూ 100 మంది ఉంటారు అంతమంది ముందు మేమిద్దరం రొమాన్స్ చేయాలి అంటే చాలా కష్టమని తెలిపారు.  ప్రతి ఒక్కరు కూడా కార్ సీన్ గురించి మాట్లాడుతున్నారు ఆ సీన్ చేయడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. చుట్టూ వంద మంది ఉండగా కారులో రొమాన్స్ చేసే సమయంలో తన మోకాలికి బాగా గాయాలు అయ్యాయని ఆ బాధను భరిస్తూ బయటకు మాత్రం రొమాంటిక్ ఫీల్ వచ్చేలా నటించడం సులభం కాదు. అలాంటి పరిస్థితులలో రొమాన్స్ చేయడం అనేది చాలా కష్టతరమని ఈ సందర్భంగా ఆ కారు సన్నివేశం గురించి అనుపమ మాట్లాడుతూ చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా మార్చి 29వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.ఇక టిల్లు స్క్వేర్ సినిమాలో నటుడు సిద్దు జొన్నలగడ్డ తో కలిసి ఈమె భారీ స్థాయిలో రొమాన్స్ చేశారు. ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి ట్రైలర్ లో ఈమె కారులో సిద్దూతో కలిసి ఘాటు లిప్ లాక్ సీన్లలో నటించింది.

దీనిపై ఆమె మాట్లాడుతూ .స్క్రీన్‌పై ఒక అమ్మాయి హాట్‌గా కనిపించడం ఎంత కష్టమో నాకు ఈ సినిమాతో అర్థమైంది. చూసిన వాళ్లందరూ గ్లామర్‌గా ఉండే పాత్రలు చేస్తుందని సింపుల్‌గా కామెంట్స్‌ చేస్తారు. అలాంటి వాటిని చేయడం చాలా ఇబ్బంది. కొన్ని కాస్ట్యూమ్స్‌ స్క్రీన్‌పై చూడడానికి కలర్‌ఫుల్‌గా ఉంటాయి. కానీ, అవి వేసుకుని సెట్‌లో అంతమంది ఎదుట ఉండాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో మాకు మాత్రమే తెలుస్తుంది. మరికొన్ని కాస్ట్యూమ్స్‌కు మొత్తం అద్దాలతో చేసిన వర్క్‌ ఉంటుంది. అవి గీసుకుపోతుంటాయి. ఇవన్నీ భరిస్తేనే గ్లామర్‌గా కనిపిస్తారు. ఇలాంటి ఇబ్బందులు పడుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న నటీమణులందరినీ మెచ్చుకోవాలి. 'టిల్లు స్క్వేర్‌'కు ఇష్టం లేకుండానే ఓకే చెప్పాను. షూటింగ్‌ ప్రారంభించాక సిద్ధూ ప్రతి విషయంలోనూ సలహాలు ఇచ్చేవాడు. నాకు నచ్చేది కాదు. ఆ తర్వాత అతడికి సినిమాపై ఉన్న ఆసక్తి అర్థం చేసుకున్నా. చాలా విషయాలు నేర్చుకున్నా' అని అనుపమ చెప్పారు.ఇదే ఇంటర్వ్యూలో సిద్ధు మాట్లాడుతూ.. ''అభిమానుల్నే కాకుండా ప్రేక్షకులందర్ని అలరించేలా 'టిల్లు స్క్వేర్‌' ఉంటుంది. కచ్చితంగా మరిచిపోలేని వినోదాత్మక సినిమాగా నిలుస్తుంది'' అని ధీమా వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: