టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా సుకుమార్ గుర్తింపు తెచ్చుకున్నారు.. ఆర్య సినిమాతో ఇండస్ట్రీలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సుకుమార్.. ఆ తర్వాత తన ట్రికింగ్ స్క్రీన్ ప్లే తో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించారు. సుకుమార్ తను తీసే ప్రతీ సినిమాలో లాజిక్ వుండే విధంగా అది ప్రేక్షకులకు కొత్తగా అనిపించేలాగా తెరకెక్కిస్తారు..అయితే 2018లో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ మూవీ సుకుమార్ కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్ గా నిలిచింది. ఈ మూవీ సుకుమార్, రాంచరణ్ ఇద్దరి కెరీర్లను మలుపు తిప్పింది. అద్భుతమైన కంటెంట్..అదిరిపోయే స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మరియు అంతకు మించి నటీనటుల యాక్టింగ్ సినిమాకే హైలెట్ అయ్యాయి.
బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ. 210 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అలాగే ఈ మూవీలో రాంచరణ్ నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఇందులో చిట్టిబాబుగా రామ్ చరణ్ కనిపించగా.. రామలక్ష్మి పాత్రలో సమంత నటించింది.. ఇద్దరు తమ పాత్రలలో ఒదిగిపోయి నటించారు.అయితే ఈ సినిమాలో లో హీరోయిన్ సమంతను సుకుమార్ వద్దనుకున్నారట .. గతంలో ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ మాట్లాడుతూ.. రంగస్థలం, సమంత గురించి ఆసక్తికర విషయాలను తెలియజేసారు.. రంగస్థలం లో చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ తప్ప మరొకరిని ఊహించుకోలేమని.. ఈ విషయాన్ని చెర్రీతో చాలాసార్లు చెప్పానని ఆయన అన్నారు. అలాగే ఈ సినిమాకు కు ముందుగా సమంతను తీసుకోవాలనుకోలేదని.. కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని అనుకున్నానని ఆయన అన్నారు.
సినిమా లో ఇద్దరూ పెద్ద స్టార్స్ అయితే సెట్ లో మేనేజ్ చేయలేనేమో అనిపించిందని.. అందుకే సమంత స్థానంలో కొత్త హీరోయిన్ ను తీసుకోవాలని అనుకున్నారట. కానీ తర్వాత పల్లెటూరి అమ్మాయి పాత్రకు సమంత సెట్ అవుతుందని తనను ఎంపిక చేశారని షూటింగ్ సమయంలో తన నటన చూసి ఆశ్చర్యపోయానని.. ఆమె పలికించిన హావభావాలు అద్భుతం అని సుకుమార్ తెలిపారు.ఈ తర్వాత తాను సినిమాలు తీసినంతకాలం సమంతను తీసుకుంటూనే ఉంటానని..ఆ సమయంలో సమంత ఏ వయస్సు లో వున్న ఆ వయసుకు తగ్గ పాత్ర ఇస్తానని..ఇలా ప్రతిసారి ఆమెకు అవకాశమివ్వాలని అనుకున్నానని అన్నారు. ప్రస్తుతం సుకుమార్ చేసిన కామెంట్స్ నెట్టింట బాగా వైరలవుతున్నాయి.