ఈ ఏడాది ఇప్పటికే అటు నాని సరసన హీరోయిన్గా నటించి హాయ్ నాన్న అనే మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక తన నటనకు కూడా మంచి మార్కులు పట్టాయి. ఇక ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని చెప్పాలి. అయితే ఇక ఈ క్రేజీ హీరోయిన్ కు ఇక ఇప్పుడు ఒక బంపర్ ఆఫర్ వచ్చింది అన్నది తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీల బన్సాలి చేయబోయే ఒక సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుందట మృణాల్ ఠాకూర్.
బాలీవుడ్ లోనే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సంజయ్ లీల బన్సాలి దర్శకత్వంలో వచ్చే సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా ఆయన సినిమాలను కళాఖండాలుగా విశ్లేషకులు అభివర్ణిస్తూ ఉంటారు. ఇక అలాంటి దర్శకుడు మూవీలో ఛాన్స్ కొట్టేసింది అంటే మృనాల్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోవడం ఖాయమని అందరూ అంచనా వేస్తున్నారు. అయితే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.