‘మహానటి’ మూవీ ఘన విజయం తరువాత ఈనాటి తరం ప్రేక్షకులు కూడ సావిత్రి జీవితంతో కనెక్ట్ అయ్యారు. అలాంటి మహానటి జీవితం పై రచయిత సంజయ్ కిషోర్ రచించిన ‘సావిత్రి క్లాసిక్స్’ అనే శీర్షికతో వ్రాయబడ్డ పుస్తక ఆవిష్కరణ సభ ఈమధ్యన హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా చిరంజీవితో పాటు మురళీ మోహన్ బ్రహ్మానందం లాంటి ఎందరో ప్రముఖులు కూడ హాజరయ్యారు.
ఈ ఈవెంట్ కు మరొక అతిధిగా వచ్చిన సావిత్రి కుమార్తె విజయ్ ఛాముండేశ్వరి మాట్లాడుతూ సావిత్రి పట్ల చిరంజీవి కి ఉన్న గౌరవం పై మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు తెలియ చేశారు. తాను ఈ పుస్తక రచయిత తో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్ళినప్పడు చిరంజీవి తమను ఎంతో అభిమానంతో ఆహ్వానించడమే కాకుండా ఎవరికీ తెలిఊయని అనేక విషయాలను చిరంజీవి తనకు చెప్పిన విషయాన్ని బయట పెట్టింది.
మెగా స్టార్ చిరంజీవి ఇంటిలో తన తల్లి నిలువెత్తు ఫోటోనని తాను చూశానని అంతేకాదు చిరంజీవి తన కెరియర్ తొలి రోజులలో నటించిన ‘పునాదిరాళ్లు’ ‘ప్రేమ తరంగాలు’ లాంటి సినిమాల్లో చిరంజీవి సావిత్రి తో కలిసి నటిస్తున్నప్పుడు మెగా స్టార్ డాన్స్ లు చూసి ఆమె కురిపించిన అభిమానం పొగడ్తలు తన జీవితంలో మరిచిపోలేనని అంటూ తనను మెగా స్టార్ చిరంజీవి తనను ఇంటి కుటుంబ సభ్యురాలుగా అభిమానించి గౌరవించిన విషయాలను విజయ్ చామండేస్వ రి తెలియ చేశారు..