టాలీవుడ్ హీరోయిన్ మీరాజాస్మిన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న సమయంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టి ఒక్కసారిగా తన సినీ కెరీర్ ని నాశనం చేసుకుంది.. ఆ తర్వాత కొన్నేళ్ళకు రీఎంట్రీ ఇచ్చినా పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది మీరాజాస్మిన్ .. తాజాగా మీరాజాస్మిన్ ఇంట విషాదం చోటుచేసుకుంది.. అసలు విషయంలోకి వెళ్తే మీరాజాస్మిన్ తండ్రి జోసెఫ్ ఫిలిప్ వృద్ధాప్య సంబంధిత సమస్యలతో గత కొన్నేళ్లుగా చికిత్స తీసుకుంటూ.. ఈరోజు ఉదయం ఆయన స్వగ్రామంలో తుదిశ్వాస విడిచినట్లుగా సమాచారం.. ఆయన వయసు 83 సంవత్సరాలు అన్నట్లుగా తెలుస్తోంది..


మీరా జాస్మిన్ తల్లి పేరు ఎలియమ్మ జోసెఫ్.. వీరికి నలుగురు పిల్లలు.. వీరిలో మీరాజాస్మిన్ చిన్న కుమార్తె.. మీరాజాస్మిన్ 2001లో లోహిత్ దర్శకత్వంలో వచ్చిన సూత్రధారణ అనే సినిమాతో మొదటిసారి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత తెలుగు, తమిళ్, మలయాళం ఇతరత్రా భాషలలో కూడా నటించింది. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలతో బిజీగా ఉంటున్న సమయంలో దుబాయ్ కు చెందిన ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను 2014లో వివాహం చేసుకుంది.


అయితే వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న మీరాజాస్మిన్ ఇప్పుడిప్పుడే తిరిగి రీఎంట్రీ ఇచ్చింది.. మొదటినుంచి మీరాజాస్మిన్ తన వ్యక్తిగత విషయాలను,  కుటుంబ విషయాలను ఎక్కడ బయట పెట్టలేదు.. తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను కూడా ఎక్కడ షేర్ చేయలేదు మీరాజాస్మిన్.. వివాహమైన ఆరేళ్ల తర్వాత మలుకల్కు అనే సినిమాతో రీయంట్రి ఇచ్చింది.. తెలుగులో విమానం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది .ఈ సినిమా మూవీ ప్రమోషన్ లో యాక్టివ్ గా ఉన్నప్పటికీ తన కుటుంబం గురించి ఎలాంటి విషయాన్ని బయట పెట్టలేదు.. అయితే మీరా జాస్మిన్ తండ్రి మరణ వార్త విని అభిమానులు సైతం ఆమెను ధైర్యంగా ఉండమంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఏమే తండ్రి వియోగం పొంది మరింత దుఃఖితురాలు అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: