తాజాగా ఇమే షోలో తన మనసు ముక్కలైన క్షణాలను కూడా తెలియజేసింది.. ఇది తన పెళ్లికి ముందు జరిగిన ఒక సంఘటనని ఒక వ్యక్తిని చాలా గాఢంగా ప్రేమించాను ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాము కానీ తను చివరికి మోసం చేస్తున్నాడామో అని అనుమానం తన మనసులో కీడును శంకించిందట. ఒకసారి తనని నేరుగా వెళ్లి అడగగా.. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని సన్నిలియోన్ అతనిని అడగగా.. దానికి అతను లేదు నీ మీద ప్రేమ ఎప్పుడో పోయింది అని చెప్పేసాడట.. ఒక్కసారిగా తన గుండె ముక్కలు అయినట్టుగా అనిపించిందని.. కానీ అప్పటికే తన పెళ్లి షాపింగ్ కూడా అయిపోయిందని తెలిపింది.
హవాయి దీవుల్లో చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలనుకున్నాము అందుకోసం అన్ని బుక్ చేసుకొని డబ్బులు కూడా కట్టేసాము.. పెళ్లి ఇంకా రెండు నెలలు సమయం ఉందని కానీ తను నేనంటే ఇష్టం లేదని చెప్పడంతో అప్పుడు చాలా నరకయాత అనుభవించాను.. అది నాకి మాత్రమే తెలుసు అంటూ సన్నిలియోన్ ఎమోషనల్ గా మాట్లాడింది.. ఆ సమయంలోనే దేవుడు తనకి మరొక వ్యక్తిని పంపించారని ఆయన కష్ట సమయాలలో అండగా నిలబడ్డారని అమ్మ నాన్న మరణించిన తర్వాత కూడా తన వెంటే ఉండి తనలో ధైర్యం నింపారని.. ఆయన ఎవరో కాదు తన భర్త అంటు చెప్పుకొచ్చింది సన్నీలియోన్. 2011లో డేనియల్ వెబ్రిని పెళ్లి చేసుకుంది 2017లో నిషా అనే అమ్మాయిని దత్తత తీసుకుంది.. ఆ తర్వాత ఏడాది సరోగసి ద్వారా ఇద్దరు కుమారులకు తల్లి అయింది.