సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు స్టార్ హీరోలు సినిమాలపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే  దర్శకనిర్మాదులు కూడా మంచి మార్కెట్ ఉన్న స్టార్ హీరోలతో సినిమాలు తీస్తే బ్లాక్ బస్టర్లు కొట్టవచ్చు అని బలంగా నమ్ముతూ ఉంటారు. ఈ క్రమంలోనే స్టార్స్ ని సినిమాలో పెట్టుకున్నారు అంటే ఆ మూవీ కోసం ఎంతటి భారీ బడ్జెట్ పెట్టడానికైనా రెడీ అవుతూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు దర్శక నిర్మాతల అంచనాలు సినిమాల విషయంలో తారుమారవుతూ ఉంటాయి.



 బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనుకున్న సినిమా చివరికి అట్టర్ ప్లాప్ గా మిగిలిపోయి నిర్మాతకు నష్టాలే మిగులుస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇలా ఇప్పటివరకు ఎన్నో సినిమాల విషయంలో జరిగింది కూడా. కానీ మల్టీస్టరర్ సినిమాలు మాత్రం దాదాపుగా హిట్ అవుతూ ఉంటాయి. అందుకే మల్టీస్టారర్ మూవీస్ ని మినిమం గ్యారెంటీ సినిమాలుగా పిలుచుకుంటూ  ఉంటారు సినిమా విశ్లేషకులు. ఇలా ఇద్దరు హీరోలు నటిస్తేనే సినిమా బ్లాక్ బస్టర్.. అలాంటిది ఏకంగా ముగ్గురు హీరోలు కలిసిన నటిస్తే ఇక ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాయడం ఖాయమని చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 33 మంది హీరోలు ఒకే సినిమాలో నటించారు


 అంతేకాదు అదే సినిమాలో పదిమంది హీరోయిన్లు కూడా నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మాత్రం చివరికి  ప్లాప్ గానే మిగిలిపోయింది  2003లో జేపీ దత్త డైరెక్షన్లో వచ్చిన ఎల్వోసీ కార్గిల్ లో 33 మంది హీరోలు పదిమంది హీరోలు నటించారు. 4.15 గంటల నిడివి  ఉన్న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి చివరికి ఫ్లాప్ అయింది. 33 కోట్ల బడ్జెట్ పెడితే కేవలం 31 కోట్లు మాత్రమే వచ్చాయి  ఇందులో సంజయ్ దత్, అజయ్ దేవగన్, సైఫ్ అలీ ఖాన్, సునీల్ శెట్టి, సంజయ్ కపూర్, అభిషేక్ బచ్చన్, నాగార్జున, రాణి ముఖర్జీ, మనోజ్ బాజ్పేయి, కరీనాకపూర్, రవినాటాండన్, నమ్రత లాంటి ఎంతోమంది స్టార్స్ నటించారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: