సినిమాలో విజయ్ యంగ్ ఏజ్ రోల్ ఒకటి కాగా మిడిల్ ఏజ్ రోల్ ఒకటి ఉంటుంది. ఆ రోల్ కి జతగా విజయ్ త్రిష కనిపిస్తుందని తెలుస్తుంది. రెండు దశాబ్ధాలుగా సౌత్ సినీ ఆడియన్స్ ను తన సినిమాలతో అలరిస్తూ వస్తుంది త్రిష. ఇప్పటికీ తన ఫాం ఏమాత్రం తగ్గలేదు. తెలుగులో కూడా త్రిష ఈమధ్య వరుస ఛాన్స్ లు అందుకుంటుంది. వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విశ్వంభర లో చిరు యో కలిసి నటిస్తుంది త్రిష.
విజయ్ గోట్ సినిమాలో త్రిష ఉంటుందని తెలిసి ఆమె ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. సీనియర్ స్టార్ హీరోలకు హీరోయిన్ గా త్రిష పర్ఫెక్ట్ గా ఉంటుంది. అందుకే చెన్నై చిన్నదాన్ని మళ్లీ మళ్లీ తీసుకుంటున్నారు. తెలుగులో విశ్వంభర చేస్తుంది అని తెలిసి వరుస ఆఫర్లతో త్రిష వెంట పడుతున్నారు మన దర్శక నిర్మాతలు. మరి త్రిష వాటిలో ఏది ఓకే చేస్తుంది అన్నది త్వరలో తెలుస్తుంది.వెంకటేష్ నెక్స్ట్ సినిమాలోనూ నాగార్జున కూడా త్రిషను తన తర్వాత సినిమాలో హీరోయిన్ గా తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.