
ఇంతటి అన్యోన్య దంపతుల మధ్య తాజాగా ఒక హీరోయిన్ వల్ల విడాకులు తీసుకోబోతున్నారని ఒక వార్త వైరల్ గా మారుతోంది. ఇక ఆమె ఎవరు అంటే సాయి పల్లవి అని సమాచారం.. ఫిదా సినిమాతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈమె నాచురల్ బ్యూటీగా తన నటనతో అందరిని అలరించింది. ఏ పాత్రలో అయినా సరే సాయి పల్లవి ఒదిగిపోతుందనటంలో సందేహం లేదు. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోల తరఫున నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈమెపై ఇప్పుడు ఒక బాడ్ రూమర్ వినిపిస్తోంది.. అదేమిటంటే సాయి పల్లవి తో ఎవరైతే నటిస్తారో వారు తమ భార్యల నుంచి విడిపోతారు అంటూ ఒక కొత్త వార్త తెరపైకి రావడం గమనార్హం... కోలీవుడ్ లో మారి 2 సినిమాలో నటించిన తర్వాత తన భార్యకు విడాకులు ఇచ్చేశారు.
మరొకవైపు అక్కినేని వారసుడు నాగచైతన్యతో కలిసి లవ్ స్టోరీ సినిమాలో నటించినప్పుడు సమంతతో ఆయన విడాకులు తీసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు సాయి పల్లవి రణబీర్ కపూర్ తో కలిసి బాలీవుడ్ లో రామాయణం సినిమాలో నటిస్తోంది.. ఈ క్రమంలోనే సాయి పల్లవి వల్ల ఆలియా , రణబీర్ కపూర్ విడాకులు తీసుకోవడం ఖాయం అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.. మరి దీనిపై వారు ఎలా స్పందిస్తారో చూడాలి.